మహిళా సాధికారతకోసం జిటో లేడీస్ వింగ్ హైదరాబాద్ పనిచేయడం అభినందనీయం : మానస్ నాగుల పల్లి

సికందరాబాద్ క్లాసిక్ గార్డెన్ లో  జిటో లేడీస్ వింగ్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యం లో  “స్వయం మరియు రోష్ని ” పేరు తో రెండు రోజుల  లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది.

ఫ్యాషన్ ప్రియులు మెచ్చే విధంగా సరికొత్త కలెక్షన్స్ ప్రదర్శన లో ఏర్పాటు చేశామని జీతో లేడీస్ వింగ్ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సర్ల భుటోడియా తెలిపారు. అన్ని రకాలైన ఉత్పత్తులు ఒకేవేదిక పై తీసుకువచ్చాను అని ఆమె అన్నారు. మహిళ లు పారిశ్రామిక వేత్తలు గా ఎడగడాని కి తమ సంస్థ ఆర్దికంగా సహాయం చేస్తుందని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమానికి గోలిసోడా సినిమా నటుడు, నంది అవార్డ్ గ్రహీత మానస్ నాగులపల్లి ముఖ్య అథిదిగా హాజరయ్యారు. . అనంతరం ఎగ్జిబిషన్ లోని అన్ని స్టాల్స్ కలియ తిరుగుతు సందడి చేసారు.

ఈ సందర్భంగా జిటో లేడీస్ వింగ్ హైదరాబాద్ చైర్ పర్సన్ సర్లా భుటోరియా మాట్లాడుతూ, జిటో బ్యానర్ కింద తమ వ్యాపారాన్ని పెంచడానికి, స్వయం ఉత్పత్తిదారులకు జితో లేడీస్ వింగ్ హైదరాబాద్ ప్రత్యేక వేదికను అందిస్తుందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు సాధికారత కల్పించడంలో భాగంగా 100 స్టాల్స్ లో 22 మందికి ఉచితంగా స్టాల్స్ ఇచ్చామన్నారు.  వారి ఉత్పత్తులను ప్రదర్శించడానికి , విక్రయించడానికి అవకాశం లేని అన్ని కేటగిరీ మహిళలను మేము ఆహ్వానిస్తున్నామన్నారు . మా జాతీయ ప్రాజెక్టులు “స్వయం మరియు రోష్ని” ద్వారా వారికి సహాయం చేయడానికి  సిద్ధంగా ఉన్నాము అని ఆమె తెలిపారు.

రోషిని ప్రాజెక్ట్ ద్వారా ఇంటి నుండి పని చేస్తున్న వారికి వ్యాపార అవకాశాలు కల్పిస్తామన్నారు. స్వయం ప్రాజెక్ట్ ద్వార డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, యాక్ససరీలు, రాఖీలు, డెకరేటివ్, బ్రైడల్ వేర్, ఫుట్ వేర్, ఈవెంట్ మేనేజర్ లు, వెడ్డింగ్ ప్లానర్ లు, బెడ్ షీట్ లు మొదలైన అన్ని కేటగిరీ ఎగ్జిబిటర్ లను భారతదేశం అంతటినుండి వారి ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

జిటో లేడీస్ వింగ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సుధా కింటీ మాట్లాడుతూ  సందర్శకులకోసం ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.  భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ప్రదర్శనను నిర్వహిస్తున్నామని… ఏ లేడీస్ వింగ్ కూడ ఇలాంటి ప్రదర్శనను నిర్వహించలేదన్నారు.

కోశాధికారి విధి సంఘ్వి, వైస్ ప్రెసిడెంట్ వీనా ఓస్ట్వాల్, ఛాయా కంకారియా, కార్యదర్శి టీనా షా, జిటో చాప్టర్ చైర్మన్ కుశాల్జీ కంకారియా, కార్యదర్శి మహేష్ జీ గోలెచా, లేడీస్ వింగ్ కోర్డినేటర్ రోహిత్ జీ కొఠారి, యూత్ వింగ్ చైర్మన్ రౌనక్ సింఘి, కార్యదర్శి రాహుల్ మరియు జిటో లోని ఇతర సభ్యులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *