సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల
హైదరాబాద్
సైదాబాద్ చిన్నారి కుటుంబ సభ్యులను బుధవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు.
బాధతురాలి ఇంటి వద్ద వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో మహిళలపై లైంగికదాడులు అధికమైయ్యాయని మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
కేసీఆర్ స్పందించే వరకూ దీక్షలోనే కూర్చుంటా: షర్మిల
సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలిక హత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు బాలిక ఇంటికి వెళ్లిన ఆమె అక్కడ దీక్షలో కూర్చున్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని షర్మిల నిలదీశారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించే వరకూ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇది పోలీసుల వైఫల్యం కాదా?ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ఆమె ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేశారు.