తెలంగాణలో మరో కొత్త పార్టీ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించబోతున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె రాజకీయాల్లోకి రానున్నారు. దివంగత వైఎస్ఆర్ అభిమానులు తమ పార్టీ వైపు ఉన్నారని ధీమాతో ఆమె కొత్త పార్టీని ప్రకటించనున్నారు .
ఈ నెల ఎనిమిదో తేదీన జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా రాజకీయ పార్టీ పేరును విధివిధానాలను షర్మిల ప్రకటించనున్నారు . కోవిద్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించనున్న ఈ సమావేశానికి అతికొద్ది ముఖ్యనేతలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రానున్న షర్మిలను తెలంగాణ ప్రజలు ఏవిధంగా ఆదరిస్తారనేది వేచిచూడాలి. కొత్త పార్టీ రాకతో తెలంగాణ రాజకీయాల్లో రానున్న రోజుల్లో సమీకరణాలు ఏవిధంగా మారతాయో చూడాలిమరి.