పార్టీ కోసం యువత స్వచ్చంధంగా పని చేయాలి : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

గ్రామ స్థాయి నుంచి ముమ్మరంగా సభ్యత్వ నమోదు

ఆంధ్ర రత్న భవన్ లో డిజిటల్ సభ్యత్వ నమోదు పై అవగాహన

హాజరైన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల అధికారి ,మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్,అసిస్టెంట్ రిటర్నింగ్ ఎన్నిక అధికారులు స్పెన్సర్ లాల్, హసీనా సయ్యద్

విజయవాడ

పార్టీలో యువతకు ప్రాతినిధ్యం ఇస్తూ సభ్యత్వ నమోదు చేయించాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మించే అవకాశం వచ్చిందని, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా నిజమైన కాంగ్రెస్ వాదులను చేర్పించాలని కోరారు. సభ్యత్వ నమోదు ద్వారా పార్టీని ప్రజలకు చేరువ చేయాలని, సంఖ్య చూసుకోకుండా నిజమైన సభ్యత్వాలు చేయాలని సూచించారు. పార్టీలో స్వచ్చందంగా పనిచేసేందుకు యువత ముందుకు రావాలని, వారికీ డిజిటల్ సభ్యత్వ నమోదు పై శిక్షణ ఇస్తామని శైలజనాథ్ స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదులో ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ కార్యకర్తలు భాగస్వాములు కావాలని కోరారు. అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో ప్రతి బూత్ లో ఎన్ రోలర్ ఉండేలా జోన్ల వారిగా సభ్యత్వ నమోదు పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా నెల రోజుల్లో ప్రతి మండలం నుంచి సభ్యత్వాలు చురుకుగా చేయాలన్నారు. పార్టీ నియమించిన 25 మంది జోనల్ ఇంచార్జి లు సకాలంలో సభ్యత్వాలు పూర్తి చేసేలా చొరవ చూపాలని శైలజనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు వారు నిర్ధేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంస్థాగత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ ఆంధ్ర రత్న భవన్ లో జరిగిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆదివారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహనా కార్యక్రమానికి మీనాక్షి నటరాజన్ తో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ ఎన్నిక అధికారులు స్పెన్సర్ లాల్, హసీనా సయ్యద్ లు హజరయ్యారు.

అలాగే ఈ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్సులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జెస్ సి.డి.మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్, డిజిటల్ మెంబర్షిప్ ఏపీ ఇంచార్జి దీపక్ జాన్, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, ఏఐసీసీ కార్యదర్శి జెడి శీలం, ఏపీసీసీ ఆర్గనైజెషన్ ఇన్ చార్జ్ పరస రాజీవ్ రతన్ మరియు వివిధ జిల్లాల నుండి ఏపీసీసీ కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *