మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజున క్యాన్సర్ పేషంట్లకు యోగా థెరిపి
హైదరాబాద్
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్ లో క్యాన్సర్ పేషంట్లకు యోగా థెరిపి కార్యక్రమం నిర్వహించారు. “Close the care gap” అనే సందేశంతో యోగా థెరపీని ప్రాంభించినట్లు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ జూలూరి తెలిపారు. .ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా క్యాన్సర్ పేషంట్లు పాల్గొ న్నారు. ప్రతి కుటుంబం లో క్యాన్సర్ మహమ్మారితో ఒకరిని కోల్పోవడం బాధ కలుగుతుందని క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడంతో ప్రాణాలను దక్కించుకోవచ్చని డాక్టర్ శ్రీనివాస్ జూలూరి అన్నారు. ప్రతి ఏటా క్యాన్సర్ వల్ల మన దేశంలో 8.5 లక్షల మంది చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవనశైలిలో మార్పులు , కీలక ప్రమాద కారకాలను పరిహరించడం ద్వారా 30% క్యాన్సర్ కేసులను నిరోధించవచ్చన్నారు. యోగా థెరపీ కాన్సర్ పేషెంట్స్ కు ఆరోగ్య పరంగా ఎంతో దోహద పడుతుందన్నారు.
క్యాన్సర్ యొక్క ప్రమాదాలను ప్రజలు అర్థం చేసుకోవడానికి , సకాలంలో స్క్రీనింగ్ ద్వారా సంక్లిష్టతలను పరిహరించడం కొరకు మరింత అవగాహన కల్పించాల్సి అవసరం ఉందని మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాద్విక్ రఘురాం అన్నారు. సకాలంలో స్క్రీనింగ్ చేయడం వల్ల క్యాన్సర్ ప్రారంభం కావడానికి ముందు కూడా నిరోధించవచ్చు అన్నారు .ముఖ్యంగా యూత్ దూమపానం, మద్యాపానానికి దూరంగా ఉండాలని రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినోద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సెంటర్ హెడ్ స్వప్నిల్ రాయ్ తో పాటు క్యాన్సర్ పేషంట్లతో వైద్య సిబ్బంది,నర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.