నేపాల్‌లో కుప్పకూలిన యతి ఎయిర్ లైన్స్ విమానం ..68 మంది మృతి?
నేపాల్ కి చెందిన యతి ఎయిర్ లైన్స్ విమానం కూలిపోయింది. ఈ విమానంలో 72 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 68 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఖాట్మాండ్ నుండి పోఖార వెళ్తుండగా ..మార్గమధ్యలో విమానం కూలింది. ఖాట్మాండ్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోఖార టూరిస్ట్ కేంద్రంగా విరాజిల్లుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది ప్రయాణీకుల్లో 5 గురు భారతీయులు ఉన్నట్లు తెలుస్తున్నది.

ఏటీఆర్ 72 విమానం రెండు టర్బో ప్రొపెల్లర్స్ కలిగిన ఇంజిన్లు ఉంటాయి. ఫ్రాన్స్,ఇటలీ దేశాల సంయుక్త భాగ స్వామ్యంతో తయారయిన ATR 72 విమానం తక్కువ దూరం ప్రయాణాల కోసం డిజైన్ చేయబడింది.

ఇక నేపాల్ లో ఒక్క ఖాట్మండు విమానాశ్రయం తప్పితే మిగతా చిన్న,మధ్య తరహా విమానాశ్రయాలు మొత్తం కొండలు లోయల మధ్య రన్ వే ని కలిగి అత్యంత ప్రమాదకరమయినవి. శిక్షణ పొందిన పైలట్లు మాత్రమే ఈ రూట్ల లో విమానాలని నడపగలరు. ఈ రూట్లలో అనుభవం ఉన్న పైలట్ లకి మాత్రమే లైసెన్స్ జారీ చేస్తారు .