హైదరాబాద్ మర్కెట్ లోకి ఎక్స్ పే లైఫ్ యుపిఐ సేవలు
హైదరాబాద్, సోమాజీగూడ
హైదరాబాదీ స్టార్టప్ సంస్థ ఫిన్ టెక్ …డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు ఎక్స్ పే లైఫ్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ సోమాజీగూడ మెర్క్యురీ హోటల్ లో ఎక్స్ పే లైఫ్ యాప్ ను సంస్థ వ్యవస్థాపకులు రోహత్ ,సీఓఓ అనంత్ లు ఆవిష్కరించారు. కస్టమర్ల కోసం బ్యాంక్ ఆన్ వీల్స్ సేవలు అందిస్తున్నామన్నారు. టచ్ స్క్రీన్ కియోస్క్ లను ఏర్పాటు చేస్తున్నామని వ్యవస్థపాకులు రోహిత్ తెలిపారు. ఎల్ పీ జీ గ్యాస్ బుకింగ్, మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లు లు , బీమా,డీటీహెచ్ రీచార్జ్ లు చెల్లింపులు చేయవచ్చని తెలిపారు. డిజిటల్ ఇండియాగా మార్చేందుకు తమవంతు కృషిగా ఈ ఎక్స్ పే లైఫ్ యాప్ ను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు