మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి: జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మీ

హైదరాబాద్ ,మాదాపూర్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ అన్నారు .

హైదరాబాద్ హైటెక్స్ లో ఫిలిఫైన్స్ దేశానికి చెందిన కెరిమో ఇంటర్నేషన్ ఫుడ్ కోర్ట్ ను ఆమె ప్రారంభించారు .పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ మారిందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు .ప్రపంచంలోని అనేక కంపెనీలు పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారిందన్నారు. కాస్మొపాలిటన్‌ సంస్కృతితో హైదరాబాద్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోందన్నారు. హైదరాబాద్ ప్రజలు భిన్న సంస్కృతులను ఎంతో ఆదరిస్తారన్న విజయలక్ష్మి… పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందన్నారు.

హైదరాబాద్ లో వ్యాపారాన్ని ప్రారంభించిన కెర్రిమో కంపెనీ ప్రతినిధులను మేయర్ విజయలక్ష్మీ అభినందించారు. హైదరాబాద్ లో కెర్రిమో స్టోర్ ను ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించిన మహిళా పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో విజయవంతంగా ఫుడ్ కోర్టులను నడుపుతున్న కెర్రిమో కంపెనీ, సౌతిండియాతో తొలి స్టోర్ ను హైదరాబాద్ లోనే ప్రారంభించడం విశేషం. ఇండియాలో కెర్రిమో ఇంటర్నేషనల్ యొక్క 8వ ఫుడ్ స్టోర్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. సురక్షితమైన వాతావరణంలో, సౌకర్యవంతంగా ఆహారాన్ని సిద్దం చేసి అందించడం కెర్రిమో ప్రత్యేకత. హైటెక్ సిటీలో ప్రారంభించిన కెర్రిమో ఫుడ్ స్టోర్ విజయవంతం కావాలని మేయర్ విజయలక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కెర్రిమో సంస్థ ప్రతినిధులు మోహిత్ శర్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వెజ్ , నాన్ వెజ్ ఫ్రై స్, చికెన్ , పన్నీర్ కబాబ్స్, చికెన్ పాప్ కార్న్ , నగెట్స్ వంటి వెరైటీ ఫుడ్ ఐటమ్స్, మిల్క్ షేక్స్, మాక్ టైల్స్, ఐటమ్స్ ను..అందిస్తున్నారు. అయితే ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ ను ఒకే కప్ లో సర్వ్ చేయడం వీరి స్పెషాలిటీ. ఈజీ గా ఫుడ్ ను క్యారీ చేసేందుకు ఈ కాన్సెప్ట్ హైదరాబాద్ లో ఫస్ట్ టైం లాంచ్ చేశామన్నారు నిర్వాహకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *