కుప్పంలో చంద్రబాబు రోడ్ షో.. పోలీసులు అనుమతిస్తారా..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపటి నుంచి.. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి శాంతిపురం మండలం పెద్దూరు గ్రామానికి చేరుకుని తన పర్యటన ప్రారంభిస్తారు. ఈ మేరకు టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో రోడ్ షోలు.. సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు ఏపీలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారుల మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతి లేదని..అరుదైన సందర్భాల్లో ఎస్పీలు, సీపీలు అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలగడం, ఇటీవల కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో జరిగిన తొక్కిసలాటల్లో ప్రజలు చనిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీుకుంది. దీంతో చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా చూడాలి.