రైల్వే జోన్ త్వరలోనే ఏర్పాటుకు కృషి చేస్తాం: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
గుంటూరు :
ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మరే ఇతర జోన్ ఇచ్చే ఉద్దేశం రైల్వేకు లేకపోయినా ప్రధాని మోదీ ఏపీకు రైల్వే జోన్ ఇస్తున్నారన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలకు రాష్ట్రం స్టిక్కర్లు వేసుకుంటోందని విమర్శించారు. పీఎం అవాస్ యోజన కింద నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్ళు ఇవ్వకుంటే రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్బికేలు, సచివాలయాలు కేంద్రం ఇచ్చే ఎన్ఆర్ఈజిఎస్ నిధులతోనే జరుగుతున్నాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందని, రైతుల సమస్యలపై శీతకన్ను వేసిందని జీవీఎల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మిర్చి రైతులు గురించి పట్టించుకోవటం లేదన్నారు. మిర్చి రైతులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. పీఎం ఫసల్ భీమా వద్దన్న సీఎం జగనే బాధ్యత తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో ప్యాకేజీ ప్రకటించకపోతే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని జీవీఎల్ హెచ్చరించారు.