వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా రెండు వందల సెల్ బే ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తాం: ఎండీ నాగరాజు సోమ
హైదరాబాద్ ,మాదాపూర్
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సెల్ బే సంస్థ కట్టుబడి ఉందని సంస్థ ఎండీ నాగరాజు సోమ తెలిపారు .
హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్‌లో సెల్ బే ఐదో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెల్ బే షోరూంలోను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక రచించినట్లు ఆయన తెలిపారు .
దక్షిణాది రాష్ట్రాల్లో రెండు వందల స్టోర్లును ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. రానున్న ఐదేళ్ళలో వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు.
సెల్ బే ఔట్‌లెట్‌ల ద్వారా 700 మందికిపైగా ప్రత్యక్ష్యంగా , 1500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నామన్నారు. సెల్ బే స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ సుహాస్ నల్లచెరు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తమ సంస్ధ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రతి స్టోర్ వన్ స్టాప్ సొల్యుషన్ గా షాపింగ్ ఎక్సీరియన్స్ కల్పించనున్నదని చెప్పారు. ప్రముఖ బ్రాండెడ్ ఫోన్ సంస్థలతో టై అప్ అవుతున్నామని …ప్రతి ఒక్క సెల్ ఫోన్ సెల్ బే ఔట్‌లెట్‌లలో లభించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సుహాస్ తెలిపారు .హెచ్ ఆర్ మార్కెటింగ్ డైరెక్టర్ సంజన, వీసీ కృష్ణ ప్రసాద్‌లు మాట్లాడుతూ రానున్న ఐదేళ్ళలో తమ గోల్ రీచ్ అయ్యేందుకు ప్రణాళికలను రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో షియోమి ఇండియా ఆఫ్‌లైన్ సేల్స్ డైరెక్టర్ సునీల్ బేబీ, రియల్ మీ డైరెక్టర్ మిస్టర్ దీపక్ నక్రా ,వివిధ బ్రాండ్‌ల సంస్ద ప్రతినిధులు పాల్గొన్నారు .