ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్లు పెట్టబడితో డైకిన్ ఏసీల యూనిట్ ను ఏర్పాటు చేస్తాం : డైకిన్ డైరెక్టర్ సంజయ్ గోయల్
హైదరాబాద్,సోమాజీగూడ
ఏపీలో వెయ్యి కోట్ల పెట్టుబడితో డైకిన్ ఏసీ యూనిట్ ను 2023లోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ డైరెక్టర్ సంజయ్ గోయల్ వెల్లడించారు.హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
డైకిన్ సంస్థ తయారు చేసిన నూతన ఏసీలు , VRV హోం ఏసీలను మార్కెట్ లోకి విడుదల చేశారు. హెల్త్ అండ్ వెల్త్ ను కాపాడుకునేలా ఈ ఏసీలను అందుబాటులో తీసుకు వచ్చామన్నారు. కరోనా లాంటి వైరస్ లను తొలగించేలా ఈ ఏసీలను రూపొందించామని తెలిపారు.
జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆధునిక ఏసీలను తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని సంజయ్ గోయల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంజయ్ గోయల్తోపాటు ఆంధ్ర, తెలంగాణ సౌత్ డిప్యూటి జనరల్ మేనేజర్ గణేష్రావు, మార్కెట్ మేనేజర్ జగదీష్, సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్ని నూతన ఉత్పత్తులను ఆవిష్కరించారు. మారుతన్న పరిస్థితులు, సాంకేతిక సదుపాయాలను, గృహావసరాలను దృష్టిలో పెట్టుకుని ఆధునాతన ఎసీలను వినియోగదారులకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. మేక్ ఇండియాలో భాగంగా జపాన్ ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విఆర్వి హోమ్ ఎసీలను రూపొందించామన్నారు. కోవిడ్ కారణంగా ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని….దీనికి తగిన విధంగా విఆర్వి హోమ్ ఎసీలను తయారు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎయిర్ కండిషన్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఎగుమతులను పెంచాలనే ఉద్ధేశంతో ఆంధ్రప్రదేశ్లో వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తున్న డైకిన్ ఎసిల తయారీ ఫ్యాక్టరీ వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తుందన్నారు. ఏపీలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వలన స్థానికంగా ఉండే వారికి ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ఉత్పత్తులను ఎగుమతులు చేసేందుకు సులవు అవుతుందన్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి 6 కోట్ల వ్యాపారం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 22 శాతం మార్కెట్ షేర్ కలిగియున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సహం కారణంగానే ఇది సాధ్యమైందన్నారు.
డైకిన్ సంస్థ సీఎస్ఆర్ యాక్టివిటీ కింద స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లు నిర్వహిస్తుందన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో ఏసీల సర్వీసింగ్ పై శిక్షణ అందిస్తున్నామన్నారు.