కొత్త జిల్లాల తరహాలోనే కొత్త మండలాలకు భవనాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పింస్తాం శాసన మండలిలో పట్నం మహేందర్ రెడ్డి

అసెంబ్లీ

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని శాసన మండలిలో పట్నం మహేందర్ రెడ్డి అన్నారు . అదే స్ఫూర్తితోనే కొత్త మండలాలలోని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి వాటికి మౌలిక సదుపాయాలను అన్ని మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.

శాసనమండలి వర్షాకాల సమావేశాల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను అయన ప్రశ్నోత్తరాల సమయంలో కొత్త మండల పరిషత్ లలో భవనాలు, కార్యాలయాల కోసం ప్రశ్నించారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాలకు మండల పరిషత్, రెవెన్యూ తదితర కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీని మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సానుకూలంగా స్పందించారు . మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 500 కోట్ల నిధులను జిల్లా, మండల పరిషత్తుల నిర్మాణాల కోసం కేటాయించారని వివరించారు. త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ లతో సమావేశం నిర్వహించి విధానాలను రూపొందించి భవనాలు తదితరాలను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించి పూర్తి చేస్తామని వివరించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *