డయాలసిస్‌ రోగులకు జీవితకాలం పింఛను ఇస్తాం : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌

డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్‌ పాస్‌కూడా ఇస్తున్నామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయని, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా అందిస్తున్నామన్నారు. భారత్‌లో మొట్ట మొదటిసారి తెలంగాణలోనే సింగిల్‌ యూజ్‌ ఫిల్టర్‌తో డయాలసిస్‌ అందుబాటులోకి తెచ్చామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారని, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్‌ చేయిస్తోందన్నారు. 5వేల మంది డయాలసిస్‌ రోగులకు పింఛను ఇస్తున్నామన్నారు. కిడ్నీ రోగులకోసం ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో కేవలం 3 ఆసుపత్రుల్లోనే డయాలసిస్‌ సేవలు ఉండేవని, ఇప్పుడు 102 డయాలసిస్‌ కేంద్రాలు ప్రతిపాదించగా 83 ఆసుపత్రుల్లో ఇప్పటికే సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సుమారు రూ.700 కోట్లు కిడ్నీ రోగులకోసం ఖర్చు చేశామన్నారు. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయని, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా అందిస్తున్నామన్నారు. డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్‌ పాస్‌కూడా ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నెలా 45లక్షల మందికి ఆసరా పింఛన్లు ఆందుతున్నాయన్నారు. ప్రతినెలా రూ.1000 కోట్లు ఆసరా పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. మెంటల్‌ హెల్త్‌ హాస్పిటల్‌ సహకారంతో 24 గంటల టెలీ మెంటల్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 14416 నంబర్‌కు కాల్‌ చేసి మానసిక సమస్యలకు పరిష్కారం పొందవచ్చన్నారు. బాధితుల వివరాలను సిబ్బంది గోప్యంగా ఉంచుతారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *