2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం: గిడుగు రుద్రరాజు
ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ (2024) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు.

జనవరి 26 నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు అన్ని జిల్లాల్లో “చేయి చేయి కలుపుదాం – రాహూల్ గాంధీ నాయకత్వాన్ని బలపర్చుదాం” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.