సంగం బ్యారేజ్ ను మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం : రాష్ట్ర వ్యవసాయ,సహకార;మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి మ; కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు

మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజి  నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి   కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంత్రి గోవర్ధన్ రెడ్డి, ఇరిగేషన్  శాఖ అధికారులతో  కలసి  సంగం బ్యారేజి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి,  బ్యారేజి  నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను,  సంబందిత  నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  జలయజ్ఞం లో  భాగంగా  2008 సంవత్సరంలో  ఈ బ్యారేజి నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. 325 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మిస్తున్న   ఈ బ్యారేజి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.   మే నెలాఖరు నాటికి సివిల్ వర్క్స్,  జూన్ నెలాఖరు నాటికి మెకానికల్ వర్క్స్ పూర్తి చేసి రానున్న మూడు నెలల కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేసేలా నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *