కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ను స్వాగతిస్తున్నాం : కామినేని హాస్పిటల్స్ డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కామినేని గాయత్రి
హైదరాబాద్
ప్రతి భారతీయుడు ఆరోగ్యంపై ఒక డిజిటల్ హెల్త్ ఐడిని తీసుకు రావడం శుభపరిణామమని కామినేని హాస్పిటల్స్ డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గాయత్రి కామినేని అన్నారు . “ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (PMDHM) యొక్క ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. ప్రజలందరికీ వారి ఆరోగ్యంతో ఒక ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ ఐడీని అందించే ఈ పథకం. భారతదేశంలో హెల్త్ కేర్ డెలివరీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ రోగులకు కేంద్రీకృత చికిత్సను అందించడంలో సహాయపడుతుందని, ఇది వారికి ఖర్చులను తగ్గిస్తుందన్నారు. అయితే ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు మెరుగైన చికిత్స ఫలితాల నుండి సంతృప్తి పొందవచ్చున్నారు.