త‌క్కువ ధ‌ర‌లో నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తున్నాం -బిగ్ బాస్కెట్ రీజనల్‌ బిజినెస్‌ హెడ్ విజయ్‌ కల్బుర్గి

తిరుపతిలో తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించిన బిగ్‌బాస్కెట్‌

రోజువారీ అవసరాలు, గ్రోసరీ కోసం ఎక్కువ మంది అభిమానించే సంస్థగా మారిన బిగ్‌బాస్కెట్‌

తిరుపతి

టాటా వ్యాపార విభాగం బిగ్‌బాస్కెట్‌ (www.bigbasket.com) తిరుపతి మార్కెట్‌లో మార్చి 2022లో ప్రవేశించింది. అప్పటి నుంచి స్ధానిక ప్రజల నుంచి అపూర్వమైన స్పందన అందుకుంటోంది. అతి స్వల్పకాలంలోనే, నగరంలో ఎక్కువ మంది అభిమానించే ఆన్‌లైన్‌ గ్రోసరీ స్టోర్‌గా బిగ్‌బాస్కెట్ నిలించింది . దేశవ్యాప్తంగా 15 మిలియన్‌ కస్టమర్‌ ఆర్డర్లతో పాటుగా దాదాపు 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రతి నెలా బిగ్‌బాస్కెట్‌ ఆర్జిస్తోంది.

తిరుపతి నగరంలో బిగ్‌బాస్కెటీర్లు 10వేలకు పైగా రోజువారీ వినియోగవస్తువులపై కనీసం 6% తగ్గింపును ప్రతి రోజూ అతి తక్కువ ధరలను అందుకుంటున్నారు. బిగ్‌బాస్కెట్‌పై తొలిసారిగా ఆర్డర్‌ చేసిన తిరుపతి వాసులెవరైనా 100 రూపాయల తగ్గింపుతో పాటు ఆఫర్ల అందిస్తోంది. బిగ్ బాస్కెట్ ఫ్లాట్ ఫాం ద్వారా లభించే విస్తృతశ్రేణి ఉత్పత్తులలో బియ్యం, పప్పులు, నూనెలు, మసాలాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, వంటింటి అవసరాలు వంటివి ఉన్నాయి. నగరంలో వృద్ధి చెందుతున్న ఆర్డర్ల సంఖ్య ఈ ప్రాంత వాసులు బిగ్‌బాస్కెట్‌ను విపరీతంగా అభిమానిస్తున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తుంది.

మార్చి 2022లో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి తిరుపతిలో అపూర్వమైన స్పందన అందుకుంటున్నామ‌ని బిగ్‌బాస్కెట్‌, రీజనల్‌ బిజినెస్‌ హెడ్ విజయ్‌ కల్బుర్గి అన్నారు. స్ధానిక ప్రజలకు చేరవ అవ‌డంతో పాటు వారి రోజువారీ అవసరాలను తీర్చడంలో సహాయపడుతున్న స్ధానిక స్టోర్‌ భాగస్వాములకు ధన్యవాదములు తెలిపారు .తిరుప‌తి నగరంలో మా ప్లాట్‌ఫామ్‌పై అత్యధికంగా బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు, వేరుశెనగ వంటివి విక్రయించ బడుతున్నాయని తెలిపారు. అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను సైతం అత్యంత అందుబాటు ధరలో అందించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు తక్కువ ధరలతో సౌకర్యవంతమైన షాపింగ్‌ అనుభవాలనందించాలనేది బిగ్‌బాస్కెట్‌ లక్ష్యమ‌న్నారు . తాము 99 శాతం సమయానికి డెలివరీ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు . ఎలాంటి ప్రశ్నలు అడగని రిటర్న్‌ పాలసీ, సరసమైన ధరలు, విస్తృతశ్రేణి ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం వ‌ల్లే వినియోగ‌దారుల‌కు చేరువైన‌ట్లు విజ‌య్ క‌ల్బుర్గి అన్నారు . దీనికి తోడు టాటా తోడ్పాటు, నమ్మకమైన ఆన్‌లైన్‌ భాగస్వామిగా ప్రజలు స్వీకరిస్తున్నార‌ని తెలిపారు .

ప్రస్తుతం బిగ్‌బాస్కెట్‌ భారతదేశంలో 200 కు పైగా నగరాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంద‌ని…. నెలకు 15 మిలియన్‌ కస్టమర్లు ఆర్డర్లను చేరవేస్తోందన్నారు. ఈ బ్రాండ్‌ ప్రస్తుత ఆదాయం 1.2 బిలియన్‌ డాలర్లుగా నిలిచిందని బిగ్‌బాస్కెట్‌, రీజనల్‌ బిజినెస్‌ హెడ్ విజయ్‌ కల్బుర్గి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *