ప్రతీ ఒక్కరికి కార్పొరేట్ వైద్యం కోసం ‘ ఆరోగ్య నిధి ’ని ఏర్పాటు చేయాలి – డాక్టర్ తిప్పరాజు వెంకట నగేష్

అందరికీ కార్పొరేట్ హెల్త్ కార్డ్స్

హైద‌రాబాద్ ,సోమాజీగూడ‌

దశాబ్దాల పాటూ కొనసాగిన నా వైద్య వృత్తిలో ఎన్నో కేసుల్ని చూశానని… ప్రతీ రోజు హాస్పిటల్స్‌కి వచ్చే వారిలో పేదలు, మధ్య తరగతి , సంపన్నులు ఉన్నార‌ని డాక్ట‌ర్ తిప్ప‌రాజు వెంక‌ట న‌గేష్ తెలిపారు. వీరిలో పేదలకు ఆరోగ్యశ్రీ లాంటి పథకాల వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అంతో ఇంతో ఉచిత సేవల వల్ల వైద్య సహకారం అందుతుంద‌న్నారు. ఇక సంపన్నులకు కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉంద‌ని తెలిపారు .ముఖ్యంగా మధ్య తరగతి పేషెంట్స్ కార్పొరేట్ వైద్యం పొందే స్థోమత లేకున్నా ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చి ట్రీట్మెంట్ పొందుతుంటారని తెలిపారు .బంగారం, భూమి వంటివి అమ్మాల్సి వచ్చినా ఆప్తుల కోసం అల్లాడిపోతూ డబ్బులు పొగు చేసి ఖర్చు చేస్తారని చెప్పారు.

మ‌న‌దేశంలో మిడిల్ క్లాస్ ప్ర‌జ‌లు కోట్ల సంఖ్యలో ఉన్నారని.. వారందరికీ యూకే లాంటి దేశాల్లో ఇచ్చిన మాదిరిగా కార్పొరేట్ ఆరోగ్యబీమా పథకం ఇక్కడ ఉచిత సేవల వల్ల ఇవ్వకూడదు? అనే ప్ర‌శ్న‌కు స‌మాధ‌నం లేదు .అభివృద్ధి చెందిన యూకే లాంటి దేశాల్లో ప్రతీ ఒక్కరూ తమ ఆదాయంలో ఇంచుమించూ 40 శాతం ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతుంటారు. అందువల్ల పెద్ద మొత్తంలో ప్రభుత్వాల వద్ద సొమ్ము ఉంటుంది. దాన్ని వారు ప్రతీ ఒక్కరికి కార్పొరేట్ ఆరోగ్యబీమా పథకం రూపంలో అందిస్తుంటారు. మన దేశంలో ఆదాయ పన్ను చెల్లించే వారు చాలా తక్కువగా ఉండటం వల్లే మధ్యతరగతి వారికి కార్పొరేట్ వైద్యం తలకు మించిన భారమవుతోంది. మరి ఈ సమస్యకి పరిష్కారం అందించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని వెంక‌ట నాగేష్ అన్నారు .

ప్రతీ ఒక్కరికి కార్పొరేట్ వైద్యం. అభివృద్ధిలో దూసుకుపోతోన్న తెలంగాణ‌ రాష్ట్రానికి పెద్ద సవాలేం కాదున్నారు . ప్రజల్ని ఒప్పించి, మెప్పించి అతి తక్కువ ఆర్దిక భారంతో ప్రభుత్వం ‘ ఆరోగ్య నిధి ’ని ఏర్పాటు చేస్తే మంచి జ‌రుగుతుంద‌న్నారు .

హైద‌రాబాద్ కేంద్రంగా మన బంగారు తెలంగాణలో ప్రతీ రోజు ఎన్నో ఆర్దిక లావాదేవీలు జరుగుతుంటాయి. అందులో ప్రతీదానిపై, లేదంటే వీలైనన్ని ఎక్కువ ఆర్దిక కార్యకలాపాలపై ‘ ఆరోగ్య బీమా’ సెస్ విధించాలని.. అయితే, ప్రజలకు ఎంత మాత్రం భారం కాని విధంగా మూడు శాతం సెస్ వేస్తే చాలుని తెలిపారు.
ఉదాహ‌ర‌ణ‌కు
హోటల్లో కాఫీ మొదలు కోట్లు ఖర్చు చేసి కట్టే ఇళ్ల వరకూ అన్నిటిపైనా మూడు శాతం
ఆరోగ్య బీమా సెస్ విధిస్తే… ఉచితంగా కార్పోరేట్ వైద్యం అందివచ్చ‌ని అంటున్నారు.

హైద‌రాబాద్ మైక్రోసాఫ్ట్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ టీ సురేంద్ర ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి వంద రోజులు శ్ర‌మించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ త‌యారు చేశారు .

ప్రజల నుంచీ సేకరించిన కార్పొరేట్ ఆరోగ్య బీమా సెస్‌ ద్వారా మంచి పేరున్న, భారీ ఇన్సురెన్స్ కంపెనీ/కంపెనీలతో సర్కార్ ఒప్పందం చేసుకుంటే అత్యంత వేగంగా ‘ అందరికీ కార్పొరేట్ వైద్యం తో ఆరోగ్యం’ సుసాధ్యం అవుతుందని వెంకట న‌గేష్ తెలిపారు . ఈ దిశగా బంగారు తెలంగాణ రథసారథి కేసీఆర్ ఆలోచించాలని కోరారు. ‘ ప్రతీ ఒక్కరికి కార్పొరేట్ వైద్యం ’ అన్న నినాదంతో అందరూ గొంతు కలపాలని ఆయ‌న అభ్యర్థించారు . కార్పొరేట్ ఆరోగ్యబీమా విషయంలో మన తెలంగాణ… యావత్ దేశానికే మార్గదర్శి కావాలని ఆయ‌న ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో సాయిఅనుజ్, ప్రణీత్, లహరి.
శ్రీధర్ రావు,డాక్టర్ శివ కుమార్, డాక్టర్ అమన్ చంద్ర, విజయ్ పాటిల్ త‌దిత‌రులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *