బ్రిటన్ లో పబ్లిక్ లిమిటెడ్ యూనివర్సిటీ లలో మేమె ఫస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ :
బ్రిటన్ లోని అత్యుత్తమమైన యూనివర్సిటీ లలో ఒకటైన బీపీపీ యూనివర్సిటీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం హైదరాబాద్ లోని ది పార్క్ హోటల్ లో జరిగింది. 1976 వ సంవత్సరం లో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం లో ఎన్నో రకాల కోర్సులను అందిస్తున్నట్టు యూనివర్సిటీ డీన్ సారా మేక్ రాయ్ తెలిపారు. బీపీపీ విద్యాసంస్థ అంటే ఒక నీతి, నమ్మకమని అన్నారు. బ్రిటన్ లో డిగ్రీ ప్రధానం చేసే మొదటి పబ్లిక్ లిమిటెడ్ యూనివర్సిటీ తమదేనని వారు పేర్కొన్నారు. అకౌంటెన్సీ, లీగల్, నర్సింగ్, వంటి విభాగాలలో డిగ్రీ, ఉన్నత డిగ్రీ వంటి కోర్సులను అందిస్తున్నట్టు యూనివర్సిటీ అసిస్టెంట్ డీన్ విక్కీ నైట్ తెలిపారు. బ్రిటన్ లోని టాప్ 4 అకౌంట్స్ కంపెనీల్లో తమ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ప్రపంచంలోని టాప్ బ్యాంక్స్ లలో ఉన్నత స్థానాల్లో పనిచేసే వాళ్ళలో తమ యూనివర్సిటీ లో చదివిన విద్యార్థులే పని చేస్తున్నారని చెప్పారు.  బీపీపీ అధ్యయన కేంద్రాలు లండన్, బర్మింగ్ హమ్, మంచెస్టర్, తో పాటు బ్రిటన్ లోని ఇతర ముఖ్య పట్టణాల్లో ఉన్నాయని ఇంటర్నేషనల్ రిక్రూట్ మెంట్ డైరెక్టర్ ఖైరూల్ అలం తెలిపారు. విద్యార్థులు కోర్స్ ప్రారంభించిన నాటి నుంచే వారికి ప్రొఫెషనల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ వంటి విషయాలపైన శిక్షణ ఇస్తామని యూనివర్సిటీ ఆపరేషన్స్ హెడ్ మోహిత్ గంభీర్ పేర్కొన్నారు. తమ యూనివర్శిటీలో టీచింగ్ స్టాఫ్ కేవలం ట్యూటర్స్ మాత్రమే కాదు ప్రొఫెషనల్ ప్రొఫెసర్లు, సబ్జెక్ట్ నిపుణులు అని అన్నారు. క్యాంపస్ లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు ఉంటాయని ఆహ్లాదకరమైన వాతావరణం లో విద్యాబోధన ఉంటుందని తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *