క్యాన్సర్ రోగుల హెల్త్ రికార్డ్ ను డిజిటలైజేషన్ చేస్తున్నాం: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

హైదరాబాద్ ,బంజారాహిల్స్

క్యాన్సర్ రోగుల వైద్య పరీక్షల రిపోర్ట్‌ను డిజిటలైజేషన్ చేశామని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ ,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.

క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించడంతో పాటు ప్రతి ఒక్క రోగి హెల్త్ రికార్డును నమోదు చేసి భద్రపరుస్తున్నట్లు ఆయన తెలిపారు .వైద్య పరీక్షల కోసం ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు హాస్పిటల్‌ను సందర్శించాల్సి ఉంటుందన్నారు.

అలా ప్రతి సారి వచ్చిన వారి రికార్డులను నమోదు చేసి భద్రపర్చడం వల్ల రోగికి కావాల్సిన వైద్య పరీక్షలను సులువుగా అందించవచ్చన్నారు.రోగి హెల్త్  రికార్డ్ డిజిటలైజేషన్ సదుపాయాన్ని BIACH&RI ఛైర్మన్ బాలకృష్ణ ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకోవడానికి వచ్చే రోగుల హెల్త్ రికార్డును డిజిటలైజేషన్ చేయడం వల్ల …రోగికి  అవసరమైన రికార్డులను వెంటనే తెలుకోవచ్చని బాలకృష్ణ అన్నారు .

ఈ కార్యక్రమంలో  BIACH&R ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ,ట్రస్ట్ బోర్డు సభ్యులు జెయస్ ఆర్ ప్రసాద్,సీఈఓ డాక్టర్ ఆర్ వి ప్రభాకర రావు,మెడికల్ డైరెక్టర్ డాక్టర్  టియస్ రావు, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా రఘునాథ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణికోటేశ్వరరావు,మెడికల్ రికార్డ్ హెడ్  జాకీర్ హుస్సేన్ తో పాటూ పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *