జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ కార్యక్రమంలో భాగంగా మూడు వేల మంది పేదలకు అన్నదానం నిర్వహించిన వీ టు హెల్ప్ యూ సంస్థ
హైదరాబాద్, వనస్థలిపురం
దానాలన్నింటి కంటే అన్నదానం ఎంతో గొప్పదని వీ టు హెల్ప్ యూ సంస్థ అధ్యక్షుడు కర్నాటి శ్రవణ్ కుమార్ అన్నారు .హైదరాబాద్ వనస్థలిపురంలో జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ లో భాగంగా వి టు హెల్ప్ యూ సంస్థ ప్రతినిధులు ఆసుపత్రుల వద్ద ,కాలనీలలోని మూడు వేల మంది పేదలకు అన్నదానం చేశారు . ఆకలితో అలమటిస్తున్నపేదలకు అన్నం పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని వీ టు హెల్ప్ యూ సంస్థ అధ్యక్షుడు కర్నాటి శ్రవణ్ కుమార్ అన్నారు.
జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ ప్రతి ఏటా 2 తేదీ నుంచి 8 వ తేదీ వరకు జరుగుతుందని ..పత్రి ఏటా వీ టు హెల్ప్ యూ సంస్థ ఈ వారంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ లో భాగంగా ప్రాజెక్ట్ అన్నపూర్ణ కార్యక్రమాన్ని ప్రారంభించామని శ్రవణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉన్న రోగులు వారి సహాయకులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశామన్నారు. అన్నపూర్ణ ప్రాజెక్ట్ కింద మెగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఈ ఏడాది సుమారు మూడు వేలకు పైగా భోజనం ప్యాకెట్లను పేదలకు అందించామన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జ్యోత్న్స దేవి, బాల ,కృష్ణ ప్రసాద్,లాస్య, నాయక్, రాకేష్, గోవర్థన్ ,సత్యనారాయణ, వాలంటీర్లు పాల్గొన్నారు