ఓట్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ ల‌ఘు చిత్రం ఆవిష్కరణ

యువతకు ఓటు ప్రాధాన్యతను , దేశభక్తిని పెంపొందించేందుకు రూపొందించేందుకు ఓట్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ ల‌ఘు చిత్రం రూపొందించిన‌ట్లు జీవిరావు తెలిపారు. హైద‌రాబాద్ తాజ్ డెక్క‌న్ హోట‌ల్ లో జీవీ రావు రూపొందించిన ఓట్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ ల‌ఘు చిత్రాన్ని మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్ కె జోషి, ias అధికారి అజ‌య్ మిశ్రాలు ఆవిష్క‌రించారు.దీనికి సంగీతం యశోకృష్ణ అందించగా….ప్రముఖ గాయకుడు కైలాస్‌ ఖేర్‌ గానం చేశారు. జాతీయ ఓటర్‌ దినోత్సవం పురస్కారించుకొని ఆ పాటను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ఐఏఎస్‌ అధికారి అజయ్‌ మిశ్రా, గేయ రచయిత అశోక్‌ తేజ, సంగీత దర్శకుడు యశోకృష్ణ, జీవిరావు తదితరులు పాల్గొన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు ఇచ్చి ప్రాణవాయు అని ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. జాతీయ స్థాయిలో ఓటు విలువ ప్రాధాన్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో తెలుగులో రాసిని ఈ పాటను గోయల్‌ హిందీలోకి అనువాదం చేశారని అశోక్‌ తేజ తెలిపారు. కైలాస్‌ ఖేర్‌ గానం, యశోకృష్ణ సంగీతం ఈ పాటకు ప్రాణం పోశాయని పేర్కొన్నారు. దేశభక్తి గేయానికి సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు యశోకృష్ణ అన్నారు. దేశానికి తనవంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ పాటను రూపొందించినట్లు జీవిరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *