వోక్స్‌వ్యాగన్ తైగున్ బుకింగ్స్‌ ప్రారంభం ..సెప్టెంబర్ 23 వ తేదీ నుంచి భారత మార్కెట్‌లో విడుదల వోక్స్ వ్యాగన్ పాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అశీష్ గుప్తా

హైదరాబాద్ ,మాదాపూర్

జర్మనీకి చెందిన అటోమొబైల్  సంస్థ వోక్స్ వ్యాగన్ …భారత్‌లో మూడు మోడల్స్‌లో తైగున్ కార్లను విడుదల చేయనుంది.కారు ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తైగున్ కార్లను ప్రత్యేక ప్రివ్యూ ద్వారా వోక్స్ వ్యాగన్ ఇండియా ప్రదర్శించింది. ఇప్పటికే బెంగలూరు, చెన్నై,కొయంబత్తూరు తర్వాత నాల్గవ మార్కెట్‌గా ఉన్న హైదరాబాద్‌లో ప్రివ్యూ ద్వారా ప్రదర్శించినట్లు బ్రాండ్ డైరెక్టర్ అశీష్ గుప్త తెలిపారు .
ముంబాయి,వచ్చే వారంలో అహ్మదాబాద్, కొల్‌కత్తా, చండీఘర్‌లలో ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు .భారత్‌లో సెప్టెంబర్ 23 తేదీన వోక్స్‌వ్యాగన్ తైగున్ కారును విడుదల చేస్తున్నట్లు అశీష్ గుప్త వెల్లడించారు .

దేశ వ్యాప్తంగా ఉన్న అధీకృత వోక్స్ వ్యాగన్ డీలర్ల వద్ద ప్రీబుకింగ్స్ ప్రారంభించినట్లు డైరెక్టర్ అశీష్ గుప్త తెలిపారు .ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ద్వారా ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించామన్నారు . ఇండియా 2.o ప్రాజెక్ట్ కింద బ్రాండ్ అవిష్కరించిన మొట్టమొదటి ప్రొడక్ట్‌గా వోక్స్ వ్యాగన్ తైగున్ నిలుస్తుందన్నారు .

ఈ ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూ సమయంలో ఆసక్తి గల వినియోగదారులు 360 విజువలైజర్ అనుభవాలను సొంతం చేసుకోవచ్చన్నారు. యాక్ససరీలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చన్నారు .టెస్ట్ డ్రైవ్, ర్వీస్ కామ్, బిజినెస్ కోసం వాట్సప్‌ పేపర్ రహిత డాక్యుమెంటేషన్ , కార్ హెల్త్ రిపోర్ట్‌ తదితర విషయాలు తెలుసుకోవచ్చన్నారు .

దక్షిణ భారతదేశంలో వోక్స్ వ్యాగన్‌కు అత్యంత ముఖ్యమైన మార్కెట్‌ అని ..అందులో ఐటీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని వోక్స్ వ్యాగన్ పాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అశీష్ గుప్తా తెలిపారు . తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా వోక్స్ వ్యాగన్ వినియోగదారులు ఉన్నారని తెలిపారు . కారు లాంచింగ్‌ కు ముందే తైగున్ అనుభవాలను సొంతం చేసుకునేవారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు .

ఫీచర్ల విషయానికి వస్తే …. ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్స్ , ప్రీమియం ఇంటీరియర్స్, డిజిటల్ కాక్‌పిట్,40కి పైగా భద్రత ఫీచర్లు, సమాచార, వినోద ఫీచర్లతో మిడ్ సైజ్ ఎస్‌యూవీడబ్యూను ఎంక్యుబీ ఏఓ ప్లాట్ ఫామ్‌పై నిర్మించారు.

టీఎస్‌ఐ ఇంజన్ సాంకేతికతో శక్తివంతమైన తైగున్ 7 స్పీడ్ డీఎస్‌జీతో రూపుదిద్దుకుంది.  1.5 లీటర్ ఇంజిన్‌ ,ఆరు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఆరు స్పీడ్ అటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లతో కూడిన 1.0 లీటర్ టీఎస్‌ఐ ఇంజన్‌తో లభ్యమవుతుంది.
ఇక బ్రాండ్ డిజైన్ ను పీపీఎస్ మోటార్స్, మోదీ గ్రూప్ డీలర్‌షిప్‌ వద్ద హైదరాబాద్‌లో యాక్టివేట్ చేశామని తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *