వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఎర్ర గంగిరెడ్డికి ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. వివేకా హత్య కేసులో సాక్షులను గంగిరెడ్డి ప్రభావితం చేసే అవకాశం ఉందని, అయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. 2019 మార్చి 15న YS వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టు వివేక హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో వివేకా కుమార్తె సునితా రెడ్డి ఇంప్లీడ్ అయివున్నారు. ఆమె అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత వాదనలు ముగిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి మరి.
