జిస్మత్ జైల్ మండి న‌వాబ్ థీమ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన యువ హీరో విశ్వక్ సేన్

హైద‌రాబాద్ ,కొండాపూర్

విభిన్న రుచులు కోరుకునే భాగ్య‌న‌గ‌ర‌వాసుల కోసం నవాబ్ థీమ్ తో మ‌రొ కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వ‌చ్చింది.హైద‌రాబాద్ కొండాపూర్ నాగర్జున ఐకాన్ లో ఏర్పాటు చేసిన “జిస్మత్ జైల్ మండి …నవాబ్ థీమ్ రెస్టారెంట్” ను టాలీవుడ్ నటుడు, పాగల్ మూవీ ఫేమ్ వుస్ విశ్వక్ సేన్ ప్రారంభించారు.

ఈ సందర్భంలో నటుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు, జైల్ .. నవాబ్ థీమ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు.

ఈ సందర్భంగా జిస్మత్ మండి నిర్వాహకులు, ప్రముఖ యూట్యూబర్ గౌతమి మాట్లాడుతూ, విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ జిస్మత్ మండి త్వరలో హిమయత్ నగర్, సుచిత్ర తో పాటు బెంగళూరు లో కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ మండి జైల్ మరియు నవాబ్ డిజైన్ థీమ్ ప్రత్యేకమన్నారు. ఈ రెస్టారెంట్ లో జైలులా డైనింగ్ సెట‌ప్ చేసి … ఖైదీల వేషదారణ తో వంట‌కాల‌ను వ‌డ్డించ‌డం ఇక్క‌డి స్పెష‌ల్ అన్నారు . ప్రాంఛైజీ నిర్వహకులు మాట్లాడతూ నవాబ్ మరియు జైల్ థీమ్ తో ఏర్పాటైన ఈ మండి రెస్టారెంట్ లో ఛెఫ్ లు ప్రత్యేకమైన జూసి మటన్ మండి, అల్ఫాహం మండి మరియు అరబిక్ ఫిష్ వంటి అనేక రకాల వంటకాలను అందిస్తున్నామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *