విశాఖ నే పరిపాలనా రాజధాని : మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి : విశాఖకు పరిపాలనా రాజధాని రావాలన్న కాంక్ష ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందనిఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వస్తుంటే టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నాయని విమర్మించారు. 3 రాజధానుల అంశంపై ఆ రెండు పార్టీలకు ఉన్న అభ్యంతరం ఏమిటని బొత్స ప్రశ్నించారు. జనసేన అసలు ఓ రాజకీయ పార్టీనే కాదన్న బొత్స ఓ వ్యక్తి పెట్టుకున్న సంస్థని అన్నారు. రాజధానికి విశాఖ దొహదపడుతుందని తెలిసి కూడా విషం కక్కుతున్నారని.. ప్రతిపక్ష పార్టీల ఆకాంక్షలు నెరవేరవన్నారు. విశాఖకు రాజధాని వచ్చి తీరడం ఖాయమని స్పష్టం చేశారు.