ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన యువతిని పరామర్శించిన జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్
విజయవాడ
పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారనికి గురైన యువతిని, వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ బాధిత యువతి కుటుంబం పట్ల ప్రభుత్వం కనీస మానవత్వం చూపించలేకపోయిందని, 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తే కంటితుడుపు చర్యగా కేవలం పది లక్షల రూపాయల చెక్కు అందించిందన్నారు. సీఎం కనీసం ఈ ఘటనపై సక్రమంగా స్పందించ లేక పోయారని, మహిళల రక్షణ, సమస్యలపై జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంటో మరొకసారి రుజువైందన్నారు . ఈ ఘటన కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగితే ఇంతవరకు అక్కడ అధికారులపై చర్యలు తీసుకోలేదని, సెక్యూరిటీ సంస్థపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాధిత కుటుంబానికి యాభై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆమె తల్లి కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముగ్గురు నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు.
మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మహిళలపై దురాగతాలు జరిగిన తర్వాత పరామర్శించడానికి మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. విజయవాడ నగరంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి 36 గంటల సమయం కావాలా అని ప్రశ్నించారు .