తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్‌ రైలు.. తొలి రోజున రైలు ఆగనున్న స్టేషన్లు

హైదరాబాద్‌: సంక్రాంతి రోజున ప్రధాని మోదీ ‘వందే భారత్‌ రైలు’ను వర్చువల్‌గా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే, రైలు ప్రారంభం రోజున ప్రత్యేక వేళల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

15న ఉదయం 10.30కు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న రైలు.. చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. రాత్రి 8.45గంటలకు విశాఖకు చేరుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *