ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి -ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్

భుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 50 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ విద్యాశాఖ మంత్రి కార్యలయం ముట్టడి చేశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ … రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ పోస్టులు పెద్దఎత్తున ఖాళీగా ఉంటే భర్తీ చేయకుండా ఇటు విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 50 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వం పర్మినెంట్ టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు విద్యా ప్రమాణాలు దెబ్బ తింటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిద్రావస్థ వదిలి ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.