లండ‌న్ లో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించాల‌నుకునే తెలుగువిద్యార్థులకు యూనివ‌ర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండ‌న్ చ‌క్క‌టి అవ‌కాశాలు కల్పిస్తుంది: ఇంటర్నేషనల్‌ రిక్రూట్ మెంట్ డైరెక్ట‌ర్ డేనియ‌ల్ కఫీ

విదేశీ విద్యలో నూతన ట్రెండ్‌ల సంబంధించిన చర్చ…

హైదరాబాద్, అక్టోబర్‌ 2022:

హైదారాబాద్‌ బంజారా హిల్స్‌లోని పార్క్‌ హయత్‌ ప్లేస్‌ వేదికగా ఐవీవై ఓవర్సీస్‌ ఆధ్వర్యంలో ‘యూకేలో విద్యావకాశాల’ గురించి సెమినార్‌ను నిర్వహించారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే, లండన్‌)లో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, అవకాశాల గురించి ఔత్సాహికులకు అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న నిపుణులు, వక్తలు యూనివర్శిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్ లో అందుబాటులో ఉన్న అవకాశాల గురించి సమగ్ర సమాచారాన్ని అందించారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది గాంచిన విద్యా వ్యవస్థల్లో యూకే ప్రధానమైంది. దశాబ్దాలుగా విద్యా వ్యవస్థలో యూకే కు ప్రత్యేక స్థానముంది. ఇక్కడ కోర్సును అభ్యసించే సమయంలో ఒక విద్యార్థి వారానికి 20 గంటలు పనిచేసుకునే అవకాశముంది. ఇంజనీరింగ్, సైన్స్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు తదితర విద్యా రంగాలలో యూకే అగ్రగామిగా ఉంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈస్ట్‌ లండన్‌ ఇంటర్నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ డైరెక్టర్‌ డేనియల్‌ కఫీ పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా డేనియల్ మాట్లాడుతూ., ఇప్పటికే అధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు యూకే యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేస్తున్నారని, వీరంతా ఈస్ట్‌ లండన్‌ విశ్వవిద్యాలయాల్లో సాంస్కృతిక వైవిధ్యాన్ని పెంచారని తెలిపారు. భవిష్యత్‌లో మరింత మంది తమ సేవలు పోందాలని కోరారు. తమ ఆధ్వర్యంలో వరుసగా సెప్టెంబర్, జనవరి, మే నెలల్లో జరిగే మూడు ఇన్ టేక్‌లలో సుమారు 2,000 మంది విద్యార్థులకు అడ్మిషన్లు అందిస్తామని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థికి సీవీ (కర్వులమ్‌ విటే)లో ఇంటర్నేషనల్‌ క్వాలిఫికేషన్‌ అనేది మరింత ప్రాధాన్యతను అందిస్తుందని, తిరగి స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు అత్యున్నత అవకాశాలను అందించడంలో కీలక పాత్ర పోషిప్తుందని అన్నారు.

ఈ సెమినార్‌లో భాగంగా ‘గ్రాడ్యుయేట్‌ ఇమ్మిగ్రేషన్‌ రూట్‌‘ గురించి ప్యానలిస్టులు సమగ్ర సమాచారాన్ని అందించారు. గ్రాడ్యుయేషన్‌ ఇమ్మిగ్రేషన్‌ రూట్‌ (ఎఫ్‌ఐఆర్‌) అనేది యూకేలో పోస్ట్‌–గ్రాడ్యుయేషన్ అనంతరం అంతర్జాతీయ విద్యార్థులు చట్టబద్ధంగా తమ బసను 2 లేదా 3 సంవత్సరాలు పొడిగించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీ వాతావరణంలో విశేష అనుభవాన్ని పొందడానికి, అంతేకాకుండా మంచి ప్రొఫెషన్‌ను వెతుక్కోవడానికి అనువై అవకాశం అని తెలిపారు. యూకే వేదికగా పని చేయడానికి అవసరమైన గ్రాడ్యుయేషన్‌ ఇమ్మిగ్రేషన్‌ రూట్‌ కోసం డిగ్రీ (బాచిలర్స్‌/ మాస్టర్స్‌/పీహెచ్‌డి) పొందిన అంతర్జాతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, బాచిలర్స్, మాస్టర్స్, డాక్టరల్‌ విద్యార్థులకు 2 సంవత్సరాలు, మూడు సంవత్సరాల వరకు మంజూరు చేయబడుతుందని పేర్కొన్నారు.

ఐవీవై ఓవర్సీస్‌ ఎండీ బిఎస్‌జి శ్రీనివాసరావు మాట్లాడుతూ., నగరం వేదికగా ‘యూనివర్శిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌ నుండి ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని, యుకెలో విద్యావకాశాల గురించి ప్యానెల్‌ మెంబర్స్, ప్రతినిథులు అందించిన సమాచారం ఔత్సాహికులకు మరింత ఉపయోగపడుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగపరుచుకుంటారని ఆశించారు.

సెమినార్‌లో నగరంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఔత్సాహికుల సందేహాలకు ప్యానెల్‌ మెంబర్స్‌ సమాధానాలు, వివరణలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతీక్‌ గుప్తా (స్టూడెంట్‌ రిక్రూట్‌మెంట్‌ అడ్వైజర్, యూనివర్శిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌), బి.రాం కుమార్‌ (మేనేజింగ్‌ పార్టనర్‌ ఐవివై ఓవర్సీస్‌), డాక్టర్‌ రవీందర్‌ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ) తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *