సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్
ములుగు
దేశం లోని అతి పెద్ద గిరిజన జాతర.. మేడారం సమ్మక్క సారాలమ్మలను కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి, గిరిజన శాఖా మంత్రి రేణుక సింగ్ దర్శించుకున్నారు.
మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్లు వారికి స్వాగతం పలికారు.హెలికాఫ్టర్ ద్వారా మేడారం చేరుకున్న వారిని అక్కడి నుండి నేరుగా తల్లుల దర్శనానికి గద్దెల వద్దకు చేరుకుని తూలబారంలో నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. అమ్మల గద్దె ల మీదకు వెళ్లి దర్శనం చేసుకొని మొక్కులు అప్పజెప్పారు.
గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్ చోగన్థ తో కలిసి ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్య వారికి మెమోంటో అందించారు. అదే విధంగా గిరిజన కలలు ఉట్టిపడేలా భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన నైకపోడ్ కళాకారులచే ప్రత్యేకంగా రూపొందించిన పంచపాండవుల కళారూపాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి మాట్లాడుతూ ములుగులో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం గిరిజన హక్కులు సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. జార్ఖండ్ తరహాలో హైదరాబాద్ లో గిరిజన మ్యూజియం కు 15 కోట్లు మంజూరు చేశామని ఇప్పటికే కోటి రూపాయలు నిధులు విడుదల చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ పూర్తి అవ్వగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం కింద ఆలయాలు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు హరిత హోటల్స్ రిసార్ట్స్ నిర్మించామన్నారు.
గిరిజన ప్రజలు ప్రతిష్టాత్మకంగా ప్రతి రెండేళ్ల కొకసారి నిర్వహించుకొనే అద్భుతమైన పండగ ఈ పండగను దేశ వ్యాప్తంగా ప్రచారానికి కు కృషి చేస్తామన్నారు.ప్రజా,దేశ సంక్షేమానికి అమ్మ వారి దీవెనలు అందజేస్తున్నారని, కరోన మహమ్మారి నుండి ప్రజలందరినీ రక్షించాలని అందరికి మంచి జరగాలని తల్లులను కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర గిరిజన శాఖా మంత్రి రేఖ సింగ్ మాట్లాడుతూ సమ్మక్క సారాలమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నని తెలిపారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర గిరిజన విశ్వవిద్యాలయ పనులు చేపడతామన్నారు. గిరిజన ప్రధానమంత్రి మార్గదర్సకత్వంలో ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.దేశంలో ప్రత్యేకంగా గిరిజన శాఖ పై ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. గిరిజన సంక్షేమానికి ప్రధానమంత్రి జన్ జ్యోతి అధివికాస్ యోజన పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 34 వేల గ్రామాల అభివృద్ధి చేశామని తెలిపారు