చికిత్స అనంతర వైద్య సంరక్షణ అవసరమైన రోగులకు ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ ఆశాకిరణం: ఉచ్చ్వాస్ వ్యవస్థాపకులు డాక్టర్ రాంపాపారావు

హైదరాబాద్ ,గచ్చిబౌలి

భారతీయ ఆసుపత్రులలో సంవత్సరానికి సగటున 25 కోట్ల మంది రోగులు డిశ్చార్జ్ అవుతున్నారు. ఒక అంచనా ప్రకారం, వారిలో 75% మంది ఇంటికి వెళ్లడానికి వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. మిగిలిన 25% మందికి దీర్ఘకాలిక సంరక్షణ, నైపుణ్యం కలిగిన నర్సింగ్ సంరక్షణ, వైద్య చికిత్సలతో కూడిన ట్రాన్సిషనల్ కేర్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్, మంచం మీద కదిలేందుకు సహాయం లేదా మంచం నుంచి బయటకు రావడానికి లేదా వారి జీవనోపాధిని తిరిగి ప్రారంభించేలా శిక్షణ పొందడానికి అదనపు మద్దతు అవసరం అవుతుంది.

మన రాష్ట్రం విషయానికొస్తే, హైదరాబాద్ ఆస్పత్రుల్లో రోజుకు సగటున 1,000 మంది రోగులు డిశ్చార్జ్ అవుతున్నారు. రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరుగుతుందని భావిస్తున్నారు.

ఇలాంటి వారికి ఇక ఆసుపత్రుల్లో చికిత్స అవసరం ఉండకపోవచ్చు గానీ, వాళ్లు పూర్తిస్థాయిలో ఇంటికి వెళ్లలేరు. అలాంటివారు పూర్తిగా కోలుకునే మార్గం ఏదన్న విషయంలో కుటుంబసభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం ఇక ఏమాత్రం లేదు. పూర్తిస్థాయిలో వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ల రూపంలో సాయం మీకు అందుబాటులోనే ఉంది. ఇక్కడ సొంత కుటుంబసభ్యుల్లాగే మానవత్వంతో చికిత్స అందిస్తారు.

ఆస్పత్రిలో కొంతకాలం పాటు చికిత్స, శస్త్రచికిత్స లేదా ఇన్వేజివ్ ప్రక్రియ, అవయవ మార్పిడి లాంటివి పొంది, కోలుకుంటున్న రోగులకు ఈ కేంద్రాలు తమ సేవలు అందిస్తాయి. వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అవసరమయ్యే సేవలు చేస్తాయి.

ఈ దిశగా ఒక కొత్త ఆశాకిరణంలా ఉదయించింది.. ఉచ్ఛ్వాస్ (ఉపశమనం). ఇది ఒక కొత్త తరం, వయోజనులకు అవసరమైన ట్రాన్సిషనల్ కేర్ సెంటర్.

ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ, నిపుణులైన నర్సింగ్, ఇతర వైద్య పునరావాస సేవలకు అంకితమైన సిబ్బంది ఇక్కడ ఉంటారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కాలంలో నాణ్యమైన ట్రాన్సిషనల్ మరియు రిహాబిలిటేటివ్ కేర్ సేవలను ఉచ్ఛ్వాస్ కేంద్రంలో నిపుణులు అందిస్తారు.

‘‘ఆస్పత్రిలో సంక్లిష్టమైన చికిత్సలు పొందిన తర్వాత, తిరిగి కోలుకోవడానికి ఎవరికి అవసరమైన పద్ధతిలో వారికి సేవలను ఉచ్ఛ్వాస్ అందిస్తుంది. సమగ్రమైన, సమర్థవంతమైన సంరక్షణతో మేము ఫిజియోథెరపీ, న్యూరో రిహాబిలిటేషన్, వెన్నెముక గాయాలకు రిహాబిలిటేషన్, ఆర్థో & స్పోర్ట్స్ రిహాబిలిటేషన్, పల్మనరీ రిహాబిలిటేషన్, క్యాన్సర్ రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ & స్వాలో థెరపీ, న్యూట్రిషనల్ థెరపీ, పునరావాస కౌన్సెలింగ్ లాంటి వైద్యపరమైన, ఇతర చికిత్సా కార్యక్రమాలను కొనసాగిస్తాము’’ అని ఉచ్ఛ్వాస్ వ్యవస్థాపకుడు రాంపాపారావు తెలిపారు.

ఒకసారి డిశ్చార్జి అయిన తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడం, దీర్ఘకాలిక చికిత్సా ఫలితాలను మెరుగుపరచడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ముఖ్యంగా వయోవృద్ధులకు సాయం చేయడం ఇక్కిడి ప్రాధాన్యమన్నారు.

ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లలో రోగులకు అయ్యే ఖర్చు టెర్షియరీ ఆసుపత్రి పడకలకు అయ్యే ఖర్చులో 20 నుంచి 25 శాతం వరకు ఉంటుంది. ఈ కేంద్రాలు ఆర్థిక భారాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో వృద్ధులైన రోగుల సంఖ్య పెరుగుతుంది, దీర్ఘకాలిక వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వారికి అందించే గొప్ప సేవ ఇదని డాక్టర్ రాంపాపారవు కేర్ సెంటర్ల ప్రాముఖ్యతను వివరించారు.

2018లో ప్రారంభమైన ఉచ్ఛ్వాస్ కేంద్రాల్లో.. ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా రోగులకు పూర్తిస్థాయి పునరావాస చికిత్సలు అందించి విజయవంతంగా ఇళ్లకు పంపారు. ఇప్పటివరకు 50వేలకు పైగా బెడ్ ఆక్యుపైడ్ డేస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు రోగి పరిస్థితిని అంచనా వేస్తూ, వాటికి సంబంధించిన రెగ్యులర్ అప్ డేట్లను రోగులకు చికిత్స అందించిన వైద్యులకు పంపుతామని ఆయన చెప్పారు. ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు ఆస్పత్రులకు పరిపూరకంగా ఉంటాయని అన్నారు.

ప్రస్తుతం నగరంలో రెండుచోట్ల ఈ కేంద్రాలున్నాయి. ఎమ్మెల్యే కాలనీ, రోడ్ నెం.12, బంజారాహిల్స్, జయభేరి పైన్ వ్యాలీ కాలనీ, కేర్ హాస్పిటల్ దగ్గర, గచ్చిబౌలి.
మరిన్ని వివరాలకు https://www.ucchvas.com/about/సంప్రదించగలరు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *