హైదరాబాద్ కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

AIPHG వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022 దక్కించుకున్న హైదరాబాద్

హైదరాబాద్ చుట్టూ ORR మీద గ్రీనరీ కి గ్రీన్ గార్లాండ్। గ్రాండ్ విన్నర్ అవార్డులు

భారత్ నుంచి ఒక్క హైదరాబాద్ కే అవార్డు వచ్చిందని ట్వీట్ చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్

హరితహరం తో హైదరాబాద్ కు ఈ అవార్డులు దక్కాయన్న అరవింద్ కుమార్

హైదరబాద్ నగరానికి ప్రతిష్టాత్మక “ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌” (AIPH) అవార్డులు దక్కడంపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ ” గ్రీన్ సిటీ అవార్డు – 2022′ మరియు ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్’ అవార్డులను హైదరాబాద్ గెలుచుకున్న సందర్భంగా,. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని సీఎం కేసిఆర్ అభినందించారు.

ఈ అంతర్జాతీయ అవార్డులు, తెలంగాణ తో పాటు దేశ ప్రతిష్టను మరింతగా ఇనుమడింప జేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్న, హరితహారం ” పట్టణాభివృద్ధి కార్యక్రమాలు.. దేశానికి పచ్చదనపు ఫలాలు’ అందిస్తున్నాయనడానికి ఈ అంతర్జాతీయ అవార్డులే నిదర్శనం అన్నారు.

ప్రపంచం లోని నగరాలతో పోటీ పడి, భారతదేశం నుండి ఈ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ద్వారా చేస్తున్న కృషి, అవలంబిస్తున్న పర్యావరణ సానుకూలత విధానాలు., అటు తెలంగాణ నే కాకుండా భారత దేశాన్ని, ప్రపంచ పచ్చదనం వేదికపై సగర్వంగా నిలిచేలా చేసిందని, ఇది యావత్ ప్రపంచం గర్వించదగ్గ విషయమని సీఎం కేసీఆర్ అన్నారు.

రాష్ట్రాన్ని మరింతగా ఆకుపచ్చ తెలంగాణగా మార్చుతూ, హరిత భారతాన్ని రూపుదిద్దే దిశగా కృషిని కొనసాగించాలని సీఎం కేసిఆర్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సీఎం కేసిఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *