శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల
తిరుమల
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం బ్యాంకుల్లో 15 కోట్ల 938 రూపాయల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొంది. 10,258.37 కేజీల బంగారం ఉందని, గత మూడేళ్లలో స్వామి వారికి భారీగా నగదు, డిపాజిట్లు పెరిగాయని పేర్కొంది.ఈ మొత్తాన్ని 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేశామని టీటీడీ పేర్కొంది . ఫిక్స్డ్ డిపాజిట్లపై వస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని టీటీడీ పేర్కొంది .