దేశవ్యాప్తంగా మరో 25 కొత్త ప్రాజెక్టులు చేపడతాం : చందన్ కుమార్ ఝా

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ట్రైకలర్ దేశ వ్యాప్తంగా 25 కొత్త ప్రాజెక్ట్ లను చేపట్టనున్నట్లు సంస్థ డైరెక్టర్ చందన్ కుమార్ ఝా తెలిపారు .హైదరాబాద్ నోవాటెల్ లో ట్రైకలర్ ప్రాపర్టీస్ సంస్థ బిజినెస్ కాంక్లేవ్ ను నిర్వహించింది. ట్రైకలర్ ప్రాపర్టీస్ సంస్థ ఏపీ,తెలంగాణ,పాట్నా,దర్బంగా,బెంగలూరు ,ముంబాయిలలో ప్రాజెక్ట్ లో మంచి బిజినెస్ ను అందించిన ఉద్యోగులకు అవార్డులు, రివార్డులతో సత్కరించింది.

దేశ వ్యాప్తంగా ఉన్న కష్టమర్లకు లాభాలు అందించేలా ప్రాజెక్ట్ లు చేపడుతున్న ట్రైకలర్ ప్రాపర్టీస్ సంస్థ మరింత పురోభివృద్ది సాధించాలని సినీ నటులు గోవింద ఆకాంక్షించారు . తక్కువ పెట్టుబడి పెట్టిన కస్టమర్లకు అధిక లాభాలు అందించేలా ఫ్లాట్లు , విల్లాలు అందిస్తున్న ట్రైకలర్ సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు .విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పిస్తున్న ఈ సంస్థ భవిష్యత్ లో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టాలని గోవింద ఆకాంక్షించారు. బిజినెస్ కాంక్లేవ్ లో భాగంగా ఉద్యోగులతో కలిసి పాటలు పాడుతూ… స్టెప్ లు వేసి అందరినీ అలరించారు.బాలీవుడ్ నటుడు అలీ తన కామెడీతో అందరినీ అలరించారు.

ఒపెన్ ప్లాట్లు, విల్లాలు ,రెసిడెన్సియల్ ప్రాజెక్ట్ ల నిర్మాణంతో అతితక్కువ సమయంలో మంచి పేరు సంపాదించడానికి కారణమైన కస్టమర్లు, ఉద్యోగులకు సంస్థ డైరెక్టర్ చందన్ కుమార్ ఝా శుభాకాంక్షలు తెలిపారు. కస్టమర్లు తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అది భవిష్యత్ లో మంచి లాభాలను అందిస్తుందన్నారు. 2010 నుంచి ఇప్పటి వరకు తమ సంస్థ 20 ప్రాజెక్ట్ లను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. 2017 లో అక్షర ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి గ్యాస్ భారతి ద్వారా హైస్కూల్ విద్యను అందిస్తున్నామన్నారు. 2017లో శ్రీవేదాంత హెల్త్ కేర్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా హాస్పిటల్ అండ్ క్రిటికల్ కేర్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు .అదే ఏడాది ట్రై కలర్ మాస్ పవన్ సొల్యూషన్స్ ప్రారంభించామన్నారు. భవిష్యత్ లో దేశ వ్యాప్తంగా 20 కొత్త ప్రాజెక్ట్ లు చేపడుతున్నట్లు చందన్ కుమార్ ఝా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *