మెడికవర్ హాస్పిటల్స్ లో హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ పైయువ ఆర్థోపెడిక్ సర్జన్లకు శిక్షణ తరగతులు,వర్చ్యువల్ విధానంలో లైవ్ సర్జరీలు, పాల్గొన్న 150 మంది యువ వైద్యులు.

హైదరాబాద్,మాదాపూర్

మెడికవర్ హాస్పిటల్స్ లో యువ ఆర్థోపెడిక్ వైద్యులకు విర్చువల్ విధానం ద్వారా శిక్షణా తరగతులను నిర్వహించారు. లైవ్ సర్జరీని ప్రదర్శించారు. సర్జరీ సమయంలో ఎలాంటి మెలుకువలు పాటించాలి , ఏ రకమైన ఇంప్లాంట్స్ వాడాలి , సర్జరీ తరువాత పేషేంట్ కు ఎలాంటి మందులు సూచించాలి అనే విషయాలను సమగ్రంగా చర్చించి సందేహాలను నివృత్తి చేశారు.ఆర్థోపెడిక్స్ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్.కృష్ణ కిరణ్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం రూపుదిద్దికుంది .

ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ కిరణ్ మాట్లాడుతూ “నాణ్యమైన వైద్య సేవలను ప్రతిబింబించే విధంగా ఈ ప్రోగ్రాం రూపొందించామన్నారు., యువ డాక్టర్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేశామన్నారు. హిప్ రీ ప్లేస్ మెంట్ సర్జరీ లో ఎలాంటి ఇంప్లాంట్స్ వాడాలి , ఎక్కువ కాలం మన్నే నాణ్యతగల ఇంప్లాంట్స్ ని ఎలా కనుగొనాలి అనే విషయాలను వివరించామన్నారు.
చాలా హాస్పిటల్స్ లో మెరుగైన వైద్య సదుపాయాలున్నా అనుభవజ్ఞులైన డాక్టర్స్ లేకపోవడం , లేక అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉన్నా సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం జరుగుతున్నదన్నారు.

మారుతున్న కాలంలో చాలామందికి మోకాళ్ళ నొప్పులు రావడం వలన రిప్లేసెమెంట్స్ చేయడం మరియు హిప్ రిప్లేసెమెంట్స్ సర్జరీస్ చేయడం జరుగుతున్నదన్నారు. ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎంతో జాగ్రత్తగా చేయాలన్నారు. ఈ ఒక్క లైవ్ సర్జరీ ద్వారా మనం హిప్ ఆర్థోప్లాస్టి ని ఎలా చేయాలి అని చెప్పడం మరియు లైవ్ ప్రాక్టికల్ గా చేసి చూపించడం జరిగిందన్నారు.

డాక్టర్ చంద్రశేఖర్ దానన మాట్లాడుతూ ఇలాంటివి లైవ్ సర్జరీస్ యువ ఆర్థోపెడిక్ సర్జన్స్ కి ఎంతో ఉపయోగమన్నారు.ఈ సర్జరీ ఎలాచేయాలి అని తెలుసుకోవడం వలన రాబోయే రోజుల్లో వాళ్ళు ఇటువంటివి మరియు ఎంత క్లిష్టమైన సర్జరీస్ ని కూడా హ్యాండిల్ చేయగలుగుతారని చెప్పారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా మనం పేషెంట్స్ కి ఎటువంటి మెరుగైన సేవలను అందిచగలం , వారికీ ఎక్కువ కాలం మన్నిక గల వైద్యాన్ని అందించడమే లక్ష్యమన్నారు.

శిక్షణ తరగతులకు హాజరైన యువ డాక్టర్ మాట్లాడుతూ “బహుశా ఈ తరహా శిక్షణ ఇదే మొదటి సారి అయి ఉండొచ్చు, ఎంతో అనుభవం గడించిన సీనియర్ వైద్యులు మాకు శిక్షణను అందించి , మా సందేహాలను నివృత్తి చేశారని తెలిపారు. చాల విషయాలను నేర్చుకున్నాం. ఎంతో సంతోషంగా ఉంది అన్నారు

అత్యాధునిక పద్ధతులు ద్వారా హిప్ రీప్లేస్మెంట్ , ఆర్థోప్లాస్టి లైవ్ సర్జరీ ని నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్స్ కి ధన్యవాదములు తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *