తాడేప‌ల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలుతాడేప‌ల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు

సీఎంకు కృతజ్ఞతలు తెలియజేసిన ఉద్యోగ సంఘాల నేతల

ఉద్యోగులంద‌రినీ స‌హ‌కారంతోనే ఈ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని.. మీ వ‌ల్లే నాలుగు అడుగులు ముందుకు వేయగలుగుతున్నాన‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు . ఆర్థిక పరిస్థితులు, కరోనా ప్రభావం వల్ల నేపధ్యంలో మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు కానీ మనసా, వాచా, కర్మణా ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశామ‌న్నారు.రాజకీయాలు ఇందులోకి వస్తే.. ఉన్న వాతావరణం చెడిపోతుందని..రాజకీయాలకు తావు లేకుండా ఏ సమస్య ఉన్నా రండి చ‌ర్చించుకుందామ‌న్నారు.
ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చుని.. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు మంత్రులు, సీఎస్, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌తో కూడిన మంత్రుల కమిటీ కొనసాగుతుందన్నారు. ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే మనది, అంటే ఉద్యోగులు కూడా అందులో భాగమేనని జ‌గ‌న్ అన్నారు . ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకునే మార్గం ఉందని… అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా పరిష్కారం చేసుకోవ‌చ్చన్నారు.

నిన్న చర్చల సమయంలో మంత్రుల కమిటీ నాతో టచ్ లో ఉందని… నా ఆమోదంతోనే వాటన్నింటినీ కూడా మంత్రుల కమిటీ మీకు చెప్పడం జరిగిందని సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఆ నిర్ణయాలు మీకు సంతృప్తినిచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఐ.ఆర్‌. ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐ.ఆర్‌ను సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల రూ.5400 అదనంగా భారం పడుతోందని తెలిపార‌.

హెచ్‌.ఆర్‌.ఏను జనవరి నుంచి వర్తింపజేయడం వల్ల అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతుంద‌ని మొత్తం రూ.5225 కోట్లు అదనపు భారం పడుతుంద‌ని చెప్పుకొచ్చారు.

ఈ అదనంగా భారం పడేది కాకుండా ప్రతి సంవత్సరం రికరింగ్‌ వ్యయం రూపేణా మార్పు చేసిన హెచ్‌.ఆర్‌.ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌క్వాంటమ్‌ ఆఫ్ పెన్షన్ వల్ల మరో రూ450 కోట్లు, సీసీఏ రూపంలో మరో రూ.80 కోట్లు ఈ మొత్తం కలిపితే రూ.1330 కోట్లు భారం పడుతోందని సీఎం వివ‌రించారు . ఇంతకముందు పీఆర్సీ ప్రకారం రూ.10,247 కోట్లు ప్రతి సంవత్సరం పెరుగుతుందనుకున్నామో.. దానికి ఈ రూ.1330 కోట్లు రికరింగ్ అంటే మొత్తంగా రూ.11,577 కోట్లు ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం రికరింగ్‌గా భారం పడుతోందని చెప్పారు. ఇది ఆర్థికంగా పడే భారం అని..మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వివరాలు చెప్తున్నానని వివ‌రించారు.

ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా… రూ.5725 కోట్లు కూడా ఏదైతే మనం ఒన్ టైం ఇస్తున్నామో… ఇది మీ పోస్ట్ రిటైర్మెంట్ మీకు ఇస్తున్నామ‌ని సీఎం ఉద్యోగ సంఘం నేత‌ల‌కు వివ‌రించారు. ఇంత పెద్ద మొత్తం ఒక్కసారి ఇవ్వాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని..మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదామ‌న్నారు. నేను ఇంతకముందే చెప్పినట్లు ఈ పరిస్థితులు ఈ మారిదిగా ఉండకపోయి ఉంటే… మీరందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని తెలిపారు .

రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయ‌ని… 2018-19లో రాష్ట్ర ఆదాయం రూ.62వేల కోట్లు ఉంటే 2019-20లో అది 15 శాతం పెరిగి రూ.72వేల కోట్లు అయిండాలి, కానీ రూ.60 వేల కోట్లకు పడిపోయిందని జ‌గ‌న్ తెలిపారు. 2020-21లో మళ్లీ 15 శాతం పెరిగితే అంటే రూ.72 వేల కోట్ల మీద మరో 15 శాతం పెరిగితే రూ.84వేల కోట్లు కావాలన్నారు. 2000-21లో రూ.60 వేల కోట్లలోనే నిలబడిపోయింది తప్ప పెరగలేదన్నారు. మరోవైపు జీతాలు విషయంలో మనం తీసుకున్న సానుకూల నిర్ణయాల వల్ల..
కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు వర్తింప చేశామ‌న్నారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్ వర్కర్స్ అందరి జీతాలు కూడా అన్నిరకాలుగా పెంచామ‌ని గుర్తు చేశారు. వీట‌న్నింటి వల్ల 2018-19లో ఉన్న రూ.52వేల కోట్లు శాలరీ బిల్లు ఈ సంవత్సరమే రూ.67 వేల కోట్లకు పెరిగిందని.. ఇప్పుడు మరలా సుమారు రూ.11 వేల కోట్లు అదనం కాబోతుందున్నారు .
ఇలాంటి పరిస్థితుల్లో ఈచర్చలు జరిగాయని… నా అంత ఉదారంగా ఎవరూ ఉండరని… నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒక్కటే.. మీరు లేకపోతే నేను లేన‌ని ఉదోగ్యసంఘ నేత‌లకు తెలిపారు.
అనేక పథకాలు పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నానంటే అది మీ వల్లే సాధ్యపడుతోందన్నారు. మీరు చేయలేకపోతే వ్యవస్ధలో సాధ్యం కాదు. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా జరుగుతుందన్నారు.

భావోద్వేగాలకు ఎప్పుడూ దయచేసి తావు ఇవ్వొద్ద‌ని.. . ఏదైనా సమస్య ఉంటే.. చ‌ర్చ‌ల‌ద్వారా ప‌రిష్క‌రించుకుందామ‌ని చెప్పారు. సీపీఎస్‌మీద గట్టిగా పనిచేస్తున్నామ‌ని.. అన్ని వివరాలూ తీసుకుని గట్టిగా పనిచేస్తున్నామ‌న్నారు. వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటానని తెలిపారు. కొత్తపద్దతిలోతీసుకుంటున్న పెన్షన్‌ మంచిగా పెరిగేలా చూస్తానని హామి ఇచ్చారు. ఒక ఉద్యోగస్తుడుకి గొప్ప మేలు ఒక ప్రభుత్వంగా గతంలో ఎవ్వరూ చేయని విధంగా జగన్ చేశాడు అనే పరిస్థితి రావాలన్నారు.

ఉద్యోగస్తులు రిటైర్ అయ్యిన తర్వాత వాళ్ల జీవితాలు గురించి ఆలోచన చేసిన పరిస్థితి వచ్చినప్పుడే ఇది జరుగుతుందన్నారు. ఉద్యోగులకు ఎవ్వరూ చేయని విధంగా జగన్‌ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా.. రిటైర్‌ అయిన తర్వాత మీకు మంచి జరిగేలా.. ఆ దిశగా అడుగులు వేస్తున్నామ‌న్నారు.
భిన్నంగా ఎలా చేయాలో కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నామ‌ని… ఎందుకంటే ఈ రోజు మీకు జరిగిపోతుంది. రిటైర్ అయిన తర్వాత మీకు జరగని పరిస్థితి ఉంటుంద‌న్నారు. ప్ర‌స్తుతం సీపీఎస్ లో ఉన్న పరిస్థితి కాకుండా భిన్నంగా ఎలా తీసుకుని రావాలా అనేదానిమీద చాలా అధ్యయనం చేస్తున్నామ‌న్నారు. . ఒక మంచి పరిష్కారంతో వస్తామ‌న్నారు. అందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామ‌ని… ఏ రకంగా చేస్తాము, ఏ రకంగా మేలు చేయగలుగుతాం అన్నది కూడా చర్చించి అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాన‌ని జ‌గ‌న్ ఉద్యోగ సంఘం నేత‌ల‌కు తెలిపారు .

కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నామ‌ని.. రోస్టర్ విధానంలో ఎవరిని నియమించామో వాళ్లందరి పట్ల కూడా సానుకూలంగా ఉండమని ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం.

30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నామ‌ని… ఈ జూన్ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నామ‌న్నారు. పిల్లలు బాగా చదవాలంటే మొత్తం అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్పే ఇవాల్టి పరిస్థితి తీసేసి… ఇంత మంది విద్యార్ధులకు ఇంత మంది టీచర్స్ ఉండేలా తీసుకుని రావడమే కాకుండా, సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నామ‌న్నారు. దీనివల్ల ఒకే టీచర్ ఒకే సబ్జెక్ట్ మీద తన ధ్యాస అంతా పెట్టగలుగుతాడు కాబట్టి తను కూడా బాగా ప్రిపేర్ అయి బాగా చెప్పగలుగుతాడని తెలిపారు. ఇంగ్లిషు మీడియం వైపు అడుగులు వేస్తూ… బైలింగువల్ టెక్ట్స్‌ బుక్స్ అంటే ఒకపేజీ తెలుగు, ఒకపేజీ ఇంగ్లిషు రావడం వల్ల పిల్లలు సులభంగా అర్ధం చేసుకుంటారని… టీచర్ల కెపాసిటీ పెరుగుతుందన్నారు.

ఒక మంచి సానుకూల వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయని..రాబోయే రోజుల్లో ఇవన్నీ మంచి ఫలితాలనిస్తాయన్నారు. అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దామ‌ని జ‌గ‌న్ ఉద్యోగ సంఘం నేత‌ల‌తో తెలిపారు.

ఎక్కడైనా కూడా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నామ‌న్నారు. దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామ‌ని గుర్తు చేశారు . 24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతోమీరు అడగకపోయినా మేం చేశామ‌ని తెలిపారు. దానివల్ల ఇక్కడ కొద్దోగొప్పో అనుకున్న మేరకు న్యాయం చేయలేకపోతాం అన్న పరిస్థితి నుంచి కనీసం ఎక్కడో ఒక చోట న్యాయం జరుగుతుందన్న మంచి ఆలోచన నుంచి ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు.

అలాగే ఎంఐజీ ఇళ్లస్థలాల విషయంలోకూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నామ‌ని జ‌గ‌న్ ఉద్యోగ సంఘం నేత‌ల‌కు వివ‌రించారు. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుందని.. అది ఎప్పుడూ మనసులో పెట్టుకోవాల‌న్నారు. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం అని… మీరు చెప్పేవి వినడానికి ఈప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. . చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చున్నారు. కానీ మీ కోసం శ్రద్ధ తీసుకునే, మీరు చెప్పేది వినే ప్రభుత్వం ఉందని… మీ సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం మీకు ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల‌న్నారు.

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *