న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

హైదరాబాద్

న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు.జనవరి ఒకటవ తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

మొదటి స్టేషన్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటు ఉంటాయి. అలాగే చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు వినియోగించుకోవచ్చు..నూతన సంవత్సర సందర్బంగా తాగి బండి నడపకుండా , డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడకుండా మెట్రో రైల్ సేవలను ఉపయోగించుకోవాలని సమయంను అధికారులు పొడగించారు. అయితే తాగి మెట్రో రైలులో అల్లరి చేయవద్దని ప్రయాణీకులకు అధికారులు సూచిస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *