ప్రముఖ కవి రచయిత పెన్నా శివరామకృష్ణకు ఈ ఏడాది కాళోజీ పురస్కారం

హైదరాబాద్

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి ని పురస్కరించుకుని ప్రతి ఏటా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు జరుపుకుంటామన్నారు.

ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె” అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహ ను అందించారని పేర్కొన్నారు .ఆయన స్ఫూర్తి ని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా పెంచేందుకు తెలంగాణ సాహితీ వేత్తలు కృషిని కొనసాగించాలని సీఎం తెలిపారు.
తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజి పేరున పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నది అని అన్నారు. “పుటుక నీది చావు నీది బతుకంతా దేశానిది” అని నినదించిన కాళోజి జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందన్నారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను అందుకుంటున్న, ప్రముఖ కవి రచయిత పెన్నా శివరామ కృష్ణ కు సీఎం కేసిఆర్ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *