భూముల విలువల సవరణ కు ఇది సరైన సమయం కాదు : తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్
తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల కాల వ్యవధిలోనే భూముల విలువ, రిజిస్ట్రేషన్ విలువలు పెంచడాన్ని తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ తప్పుపట్టింది. కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరిగిపుంజుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పేద ప్రజలకు భారంగా మారుతుందని తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రావు అన్నారు .ప్రభుత్వ నిర్ణయంతో పేదల సొంతింటి కలను దూరం చేసేలా ఉందన్నారు.
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందని ప్రభాకర్ రావు అన్నారు. శాంతిభద్రతలు బాగున్నాయని…విద్యుత్ కోతలు లేవని… సంఘ వ్యతిరేక శక్తుల భయం లేదన్నారు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఇతర రాష్ట్రాల వారు సైతం తెలంగాణలో స్థిరపడాలని అనుకుంటున్నారని తెలిపారు.
మార్కెట్ విలువలను సవరించడం ద్వారా నిర్మాణ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ రంగం పెద్ద దెబ్బ అని…ఇటీవల ఆరు నెలల క్రితం భూముల ధరలను సవరించిందని గుర్తు చేశారు. కొత్త సవరణల ప్రకారం కన్వేయన్స్ డీడ్ ప్రకారం స్టాంపు డ్యూటీని 37.5% పెంచారని.. అందువల్ల ఇప్పటికే 22.7.2021 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల భారం 25% పెరిగిందన్నారు. ఇక వ్యవసాయ భూములు, ఇతర అన్ని ఆస్తుల మార్కెట్ విలువలు 30% నుంచి 100% వరకు పెరిగాయన్నారు. నాలా పన్ను జీహెచ్ఎంసీ పరిధిలో 50%, ఇతర ప్రాంతాల్లో 67% పెంచారని తెలిపారు. .