ఇది దగాకోరు బడ్జెట్..- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ పట్ల బిజెపి మోడీ వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది

తెలంగాణ ను శత్రువుగా చూస్తున్నారు

హైదరాబాద్:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు పైసా ఉపయోగం లేదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. యావత్ దేశ ప్రజలను మోడి ప్రభుత్వం దగా చేసిన బడ్జెట్ గా మంత్రి అభివర్ణించారు. 40 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రం… తెలంగాణ రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు.
బిజెపి ,కేంద్ర ప్రభుత్వం,ప్రధాని మోడీ గారు తెలంగాణ కు శత్రువుల వ్యవహరిస్తున్నారని మంత్రి మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్షపూరిత ధోరణిని మానుకోవాలని అన్నారు.

బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేక పోవడం చూస్తుంటే కేంద్రం వ్యవహరిస్తున్న తీరు… వివక్షకు దర్పణం పడుతోందని చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లెక్కలు చెప్పి ప్రజలను మభ్య పెట్టడం తప్పా… ఎలాంటి ఉపశమనం కలిగించ లేదని మంత్రి వివరించారు. కేంద్ర వార్షిక బడ్జెట్ లో నిజామాబాద్ కు పసుపు బోర్డు హామీని నెరవేర్చ లేకపోయినా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇకపై బడాయి మాటలు మానుకొని ఇంట్లో కూర్చోవాలని హితవుపలికారు.

ఎంపీ అరవింద్ కు ఢిల్లీలో సొంత బిజెపి పార్టీయే పట్టించుకోదని… ఈ బడ్జెట్ తో విషయం తెలిసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు పైసా ప్రయోజనం లేక పోయినందున రాష్ట్ర బిజెపి నాయకులు బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగులను, రైతులను, సామాన్య ప్రజలను నిలువునా మోసం చేసిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సబ్ కా వికాస్ అంటూ గొప్పలు చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ… ప్రజల పాలిట సబ్ కా వినాస్ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ఇందుకు బడ్జెట్ కేటాయింపులు నిదర్శనమని చెప్పారు. బిజెపికి ప్రజలంతా గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *