ప్రాచీన కాలం నాటి వాల్ క్లాక్ లకు జీవం పోయడమే తమ లక్ష్యం -రమేష్ స్విస్ వాచ్ గ్యాలరీ ఫౌండర్ లక్ష్మణ్
ప్రాచీన కాలం నాటి వాల్ క్లాక్ లకు జీవం పోయడమే తమ లక్ష్యం -రమేష్ స్విస్ వాచ్ గ్యాలరీ ఫౌండర్ లక్ష్మణ్
హైదరాబాద్ ,బేగంపేట్
పురాతన గడియారాలకు జీవం పోయడమే తమ లక్ష్యమని రమేష్ స్విస్ వాచ్ గ్యాలరీ ఫౌండర్ లక్ష్మణ్ అన్నారు .నిజాంకాలం నాటి క్లాక్ టవర్స్ లో గడియారాలను తాను పునఃరుద్దరించానని చెప్పుకొచ్చారు. చారిత్రాత్మక క్లాక్ టవర్ లలో ని గడియారాలకు అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి సోలార్ ద్వారా పనిచేసేలా చేస్తామని లక్ష్మణ్ చెబుతున్నారు.
మానవులు గడియారం లేని సమయంలో సూర్యుని కదలికల ద్వారా నీరు, కొవ్వత్తి గడియారాల ద్వారా సమయాన్ని అంచనా వేసేవారని తెలిపారు . ఆ రోజుల్లో అందరి చేతికి గడియారాలు ఉండేవికాదని…కొద్ది మంది ధనవంతుల చేతుల్లో మాత్రమే ఉండేవన్నారు. గులబ్రాయ్ డి .చుగ్గాని పాకిస్తాన్ నుంచి వలస వచ్చి రమేష్ వాచ్ కంపెనీ ప్రారంభించారని…1947 తర్వాత రమేష్ స్విస్ వాచ్ గ్యాలరీగా పేరు మార్చబడిందన్నారు. గులబ్రాయ్ డి.చుగ్గాని కుమారుడైన లక్ష్మణ్ చుగ్గాని పురాతన వాచ్ లను రిపేరు చేస్తున్నారు. తన తండ్రి వద్ద వాచ్ ల తయారు, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ బెంగలూరు హెచ్ఎంటీ కంపెనీలో శిక్షణ పొందారు. అనంతరం విదేశీ వాచ్ లకు మంచి డిమాండ్ ఉందని తెలిసి స్విర్జర్లాండ్ కు వెళ్ళి శిక్షణ పొందారు. హైదరాబాద్ లో లక్ష్మణ్ చుగ్గాని రమేస్ స్విచ్ వాచ్ గ్యాలరీని ఏర్పాటు చేశారు . హైదరాబాద్ కు విదేశీ బ్రాండ్ వాచ్ లను పరిచయం చేసిన ఘనత లక్ష్మణ్ చుగ్గానికే దక్కింది.
అప్పటి ప్రభుత్వం రైల్వేలు, చర్చిలు, దేవాలయాలు, వైండింగ్ వాల్ క్లాక్ లను హెచ్ఎంటీ కంపెనీకి ఇచ్చింది. దీంతో నగరంలో పలు చోట్ల గడియారాలను మరమ్మత్తు చేసేవారు .గడియారాలను తయారు చేయడం అంటే వాటికి జీవం పోయడం లాంటిదని లక్ష్మణ్ చుగ్గాని చెప్పుకువచ్చారు .