జర్నలిస్టు సంక్షేమ పథకం మార్గదర్శకాలను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ ,
జర్నలిస్టు సంక్షేమ పథకం మార్గదర్శకాలను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ అక్రిడిటెడ్, అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులు అందరూ సమానంగా ఈ పథకం కింద లబ్ధిని పొందడం జరుగుతుంది.
సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని జర్నలిస్టుల సంక్షేమ పథకం ప్రస్తుత మార్గదర్శకాలను పరిశీలించి,అందులో మార్పుల కోసం తగిన సూచనలను చేసేందుకు ప్రసార భారతి సభ్యుడు, ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ కుమార్ టాండన్ నాయకత్వంలో పది మంది సభ్యులతో కూడిన కమిటీని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియమించింది.
కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను కోల్పోవడం,వర్కింగ్ జర్నలిస్టులు అన్న నిర్వచనానికి ఒక విస్త్రత ప్రాతికపదిక సహా మీడియా పర్యావరణంలో చోటు చేసుకున్న అనేక మార్పుల వెలుగులో ఈ నిర్ణయాన్ని ముఖ్య మైనదిగా పరిగణిస్తున్నారు.
దేశంలో ఉన్న జర్నలిస్టు లందరికీ వర్తించేలా, భవిష్యత్ దృక్పధంతో ఎన్నో ఏళ్ళుగా ఉనికిలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమ పథకాన్నిపునః పరిశీలించవలసిన అవసరం ఉంది.
వృత్తిపరమైన,భద్రత, ఆరోగ్యం,పని పరిస్థితుల కోడ్ 2020 చట్టాన్ని చేసిన తర్వాత,వర్కింగ్ జర్నలిస్టుల నిర్వచనం అన్నది అటు సంప్రదాయ మీడియా,ఇటు డిజిటల్ మీడియాలో పని చేస్తున్న వారందరికీ వర్తించేలా విస్తరింపచేసింది.
అలాగే,సంక్షేమ దృక్పధం నుంచి అక్రిడిటెడ్, అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులు అందరూ సమానంగా ఈ పథకం కింద లబ్ధిని పొందడం అవసరం అని పరిగణించడం జరిగింది.
కోవిడ్ 19 మహమ్మారి కారణంగా దురదృష్టవశాత్తు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు ఇటీవలి కాలంలో సమాచార, ప్రసార శాఖ సానుకూల చర్యలు తీసుకుంది.
అటువంటి సహాయంలో భాగంగా వంద కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున సాయాన్ని అందించడం జరిగింది.
కమిటీ నిర్ణీత సమయంలో అంటే రెండు నెలల్లోగా నివేదిక అందించనుందని అంచనా…జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించేందుకు వారి సూచనలు తోడ్పడతాయి.
కమిటీకి అశోక్ కుమార్ టాండన్ అధ్యక్షత వహిస్తుండగా,ది వీక్ రెసిడెంట్ ఎడిటర్ సచ్చిదానంద మూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్టు శేఖర్ అయ్యర్,న్యూస్ 18కి చెందిన అమితాబ్ సిన్హా, బిజినెస్ లైన్ నుంంచి శిశిర్ కుమార్ సిన్హా,జీన్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్ రవీదర్ కుమార్, పాంచజన్య ఎడిటర్ హితేష్ శంకర్, హిందుస్తాన్ టైమ్స్‌కి చెందిన స్మృతి కాక్ రామచంద్రన్,టైమ్స్ నౌకు చెందిన అమిత్ కుమార్, ఎకనమిక్ టైమ్స్‌కు చెందిన వసుధ వేణుగోపాల్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డిజి, కంచన్ ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు.