హైదరాబాద్ బేగంపేట్ కంట్రీక్లబ్ లో ద స్టైల్ స్టోరీ ఎగ్జిబిషన్ ప్రారంభం
బేగంపేట్
ఫ్యాషన్ ప్రియుల కోసం సరికొత్త బ్రైడల్ వేర్ కలెక్షన్స్ , లేటెస్ జూవెలరీ కలెక్షన్స్ తో ద స్టైల్ స్టోరీ ఎగ్జిబిషన్ వచ్చేసింది. హైదరాబాద్ బేగంపేట్ కంట్రీక్లబ్ లో ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు ద స్టైల్ స్టోరీ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు.
దస్టైల్ స్టోరీ లగ్జరీ వెడ్డింగ్, ప్యాషన్ ఎగ్జిబిషన్ 21 వ ఎడిషన్ శనివారం 9 జూలై 2022 నుండి ఆది వారం 10 జూలై 2022 వరకూ నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటూ నిర్వహించబడుతున్న ఈ ప్రదర్శనలో దేశం నలుమూలల నుండి వచ్చిన 35 మందికి పైగా డిజైనర్లు తమ తమ వస్త్ర ఉత్పత్తులను ప్రదర్శించారు. రాబోయే వివాహ, పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డిజైన్లను అందుబాటులో ఉంచినట్లు నిర్వహకులు తెలిపారు. లేటెస్ట్ ట్రెండ్స్ ను అనుసరిస్తూ రూపొందించిన పలు రకములైన వస్త్రాలు, అలంకరణ సామగ్రి, వజ్రాభరణాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి .
ద స్టైల్ స్టోరీ ఎగ్జిబిషన్ నిర్వహకులు కుమారి సుచరిత మాట్లాడుతూ ఒక వైపు షాపింగ్ కు సంబంధించిన పలు రకములైన స్టాల్స్ తో పాటూ హైదరాబాదుకు చెందిన ప్రత్యేక వంటకాలు , స్ట్రీట్ ఫుడ్ ను అందించే ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశామన్నారు . ఈ వారాంతంలో షాపింగ్ తో పాటూ మంచి ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుందన్నారు. పూల్ సైట్ ఏర్పాటు చేస్తున్న ఈ ఫుడ్ కోర్టుతో కుటుంభమంతా వారాంతాన్ని ఆహ్లాదకరంగా గడుపవచ్చని చెప్పారు.
అహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబం ఉల్లాసంగా గడుపుతూ షాపింగ్ కూడా చేయడానికి వీలు ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నామన్నారు .భాగ్యనగరవాసలుఉ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు .