ఐటీ రంగం అభివృద్ధి, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీల వినియోగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు
హైదరాబాద్
ఐటీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, దాన్ని సాధించేందుకు ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు, ఐటీ పరిశ్రమ భాగస్వామ్యం వంటి అంశాల పైన గత రెండు రోజులుగా హైదరాబాద్ లో పర్యటిస్తున్న ఐటి వ్యవహారాల పైన ఏర్పాటయిన పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు కురిపించింది. గత రెండు రోజులుగా ఇక్కడ పర్యటిస్తున్న కమిటీ ఇక్కడ ఉన్న మౌలిక వసతులతో పాటు ఇతర అంశాల పైన నేరుగా అధ్యయనం చేసింది.
ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, విజన్ పైన మంత్రి కేటీఆర్, స్థాయి సంఘానికి వివరాలు అందించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించింది. కచ్చితంగా రానున్న కాలంలో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు కొనసాగితే హైదరాబాద్ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆదర్శవంతమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్న తెలంగాణ పద్ధతులను, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అంశంపైన తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామన్నారు. ఎక్కడయన ఆదర్శవంతమైన కార్యక్రమాలు కొనసాగితే వాటి ద్వారా నేర్చుకొని, ప్రజాసంక్షేమం కోసం వాటిని అమలు చేసే విషయంలో ముందు ఉండాలన్న ఉద్దేశ్యమే తమదని, ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ గవర్నెన్స్ సేవలు, ఇన్నోవేషన్ రంగంలో ఇంకుబేటర్ ల ఏర్పాటు, టీ ఫైబర్ ప్రాజెక్టుల పైన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది.
సమావేశానంతరం కమిటీ అధ్యక్షులు శశిథరూర్ తో పాటు మిగిలిన పార్లమెంట్ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్ వారికి జ్ఞాపికలు అందజేశారు.
శశిధరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా ఐటీ కి సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలు వాటికి సంబంధించిన అంశాల పైన మంత్రి కే తారకరామారావు సంఘానికి వివరించారు. పార్లమెంటరీ కమిటీ అధ్యయనం కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న కార్యక్రమాలను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కేటీఆర్ మరియు ఐటీ శాఖ విభాగాల అధిపతులు పార్లమెంట్ సంఘానికి వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన ts-ipass మరియు ఇతర విధానపరమైన నిర్ణయాలు, ఐటి పరిశ్రమ తో కలసి ప్రభుత్వం పని చేయడం వలన అనేక పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని కేటీఆర్ అన్నారు
ప్రపంచంలోని అతి పెద్ద టెక్ కంపెనీలకు సంబంధించిన అమెరికా ఆవల అతిపెద్ద క్యాంపస్ లు 4 హైదరాబాద్ లో ఉన్నాయని వివరించారు.
ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన తో పాటు ఐటీ ఎగుమతుల ను సైతం భారీగా పెంచగలిగమన్నారు
ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం ఐటి రంగంలో వృద్ది సాధించడానికి ప్రభుత్వం తరఫున చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు
పాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల పైన వివరాలు అందించారు
ఇన్నోవేషన్ రంగంలో ఏర్పాటు చేసిన ఇంకుబేటర్ ల వివరాలు అందజేశారు. టీ హబ్, వి హబ్, అగ్రి హబ్, బీ హబ్ ,రిచ్, టీ వర్క్ వంటి కార్యక్రమాలను తెలిపారు
పార్లమెంటరీ స్థాయి సంఘం అత్యంత ఆసక్తిగా అడిగిన డిజిటల్ ఎకానమీ/గవర్నన్స్ లో ఐటి టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన వివరాలను కేటీఆర్ అందించారు
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మీసేవ కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పులు ముఖ్యంగా మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్ లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు… టి వాలెట్ సాధించిన మైలురాళ్లను తెలిపారు
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క భారత్ నెట్ ప్రోగ్రాం ని మరింతగా విస్తరించి చేపట్టిన ప్రాజెక్టు వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా దీనికి ప్రత్యేకంగా కేంద్రం మద్దతు ఇవ్వాల్సిన విషయాన్ని పార్లమెంటరీ కమిటీకి తెలిపారు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ ద్వారా చేపడుతున్న డ్రోన్ ప్రాజెక్టు, హరితహారం లో డ్రోన్ల వినియోగం, సైబర్ సెక్యూరిటీ కి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకు రానున్న విషయాలను కేటీఆర్ వివరించారు
ముఖ్యమంత్రి విజన్ మేరకు ఏర్పాటు చేసిన ధరణికి వినియోగిస్తున్న టెక్నాలజీ, దాని పని తీరు పైన వివరాలు అందించారు.
తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రత్యేకంగా సహాయం అందించడంలో కేంద్రం ప్రభుత్వం మరింత చొరవ చూపించేలా ఇక్కడి విధానాల పైన ప్రత్యేక సిఫార్సు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కమిటీని కోరారు. తెలంగాణ లాంటి నూతన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఐటి శాఖ మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా ఐటీఐఆర్ వంటి సమాంతర ప్రాజెక్టుని లేదా అదనపు ప్రోత్సాహాన్ని వెంటనే ప్రకటించే అంశంలో ఈ కమిటీ సహకరించాలని కోరారు..