సుమధుర,వాసవి గ్రూప్ ల నుంచి హైదరాబాద్ లోనే అతి పొడవైన రెసిడెన్సియల్ టవర్స్ గా ద ఒలింపస్ ప్రాజెక్ట్

హైదరాబాద్, బంజారాహిల్స్.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు సుమధుర గ్రూప్, వాసవి గ్రూప్ లు సంయుక్తంగా హైదరాబాద్ లో అత్యంత పొడవైన రెసిడెన్సియల్ టవర్స్ ను నిర్మించనున్నట్లు సుమధుర గ్రూప్ ఛైర్మన్ జి.మధు సూదన్ ,వాసవి గ్రూప్ సీఎండీ యర్రం విజయ్ కుమార్ లు తెలిపారు.

హైదరాబాద్ హయత్ ప్యాలెస్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త ప్రాజెక్ట్ ద ఒలింపస్‌ సంబంధించిన వివరాలు వెల్లడించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యంత పొడవైన రెసిడెన్షియ్ టవర్స్‌ గా ద ఒలింపస్‌ నిలుస్తుందని సుమధుర గ్రూప్ ఛైర్మన్ జి.మధు సూదన్ , వాసవి గ్రూప్ సీఎండీ యర్రం విజయ్ కుమార్ లు తెలిపారు. సుమధుర గ్రూప్‌ ,వాసవీ గ్రూప్‌ సంయుక్త భాగస్వామ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలి నానక్ రాంగూడలో అత్యంత విశాలమైన 44 అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. నానక్ రాంగూడలో 5.06 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ లో 854 కుటుంబాలు అత్యంత సౌకర్యవంతంగా నివాసముండేలా సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్స్‌ తో నిర్మిస్తున్నామన్నారు. ద ఒలింపస్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ఈ కన్సార్టీయం ద్వారా 1000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుందని…. దీనిలో అత్యధిక మొత్తం అంతర్గతంగా నిధుల సేకరణతో పాటుగా వినియోగదారులు చెల్లించే అడ్వాన్స్‌ల ద్వారా సమకూర్చుకోగలుగుతామన్నారు.

ఈ ప్రాజెక్ట్‌ ద్వారా మొత్తంమ్మీద 20 లక్షల చదరపు అడుగులను విక్రయించనున్నట్లు ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి అయిన తరువాత గ్రేటర్‌ హైదరాబాద్‌లో అత్యంత పొడవైన టవర్లుగా నిలువడంతో పాటుగా 854 లగ్జరీ ఫ్లాట్లు త్రీ బీహెచ్ కె, ఫైవ్ బీహెచ్ కె గా ఉంటాయన్నారు. ఒక్కో ఫ్లాటు 1670 చదరపు అడుగుల నుంచి 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందించనున్నట్లు వాసవి, సుమధుర డైరెక్టర్లు తెలిపారు . ద ఒలింపస్ ప్రాజెక్ట్ లో 50వేల చదరపు అడుగుల క్లబ్‌ హౌస్‌, ఈ క్లబ్‌ హౌస్‌లో కో వర్కింగ్‌ స్పేస్‌లు, కేఫ్‌, లైబ్రరీ, స్విమ్మింగ్‌ఫూల్‌, గెస్ట్‌ సూట్స్‌ , బీబీక్యు టెర్రాస్‌, స్పోర్ట్స్‌ బార్‌, జిమ్‌, బాడ్మింటన్‌ కోర్టు, స్క్వాష్‌ కోర్ట్‌, ఇండోర్‌ గేమ్స్‌, స్పా, సలోన్‌ వంటి సౌకర్యాలు ఉన్నట్లు వెల్లడించారు. స్మార్ట్ హోం టెక్నాలజీతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రపంచశ్రేణి సదుపాయాలు కల్పించామన్నారు .ఈ ప్రాజెక్ట్ సెంట్రలైజ్డ్‌ ఏసీని ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు

ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభం గురించి సుమధుర గ్రూప్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌ జి మాట్లాడుతూ వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌ చేసుకుంటూ, ఆహ్లాదకరమైన జీవితం కోరుకునే వ్యక్తులు, కుటుంబాల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దామన్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నడిబొడ్డున ఉన్న ఈ ప్రాజెక్ట్‌ విశ్రాంతి మరియు పునరుత్తేజ అనుభవాలను పొందడానికి అవసరమైన సదుపాయాలు, ప్రాంగణాన్ని అందిస్తుందన్నారు. డిమాండ్‌తో కూడిన జీవనశైలి మరియు ప్రియమైన వారితో మధురక్షణాలను ఆస్వాదించాలనుకునే వారి ఆహ్లాదకరమైన అనుభూతులను అందించే అత్యుత్తమ ప్రోపర్టీలలో ఒకటిగా ద ఒలింపస్‌ నిలుస్తుందన్నారు . మా కొనుగోలుదారులకు ఖచ్చితంగా ఇది అత్యంత గర్వకారణమైన ఎంపికగా నిలువడమే కాదు తరాల తరబడి ఆనందాన్నీ అందించనుందన్నారు.

వేవ్‌రాక్‌ సెజ్‌కు పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉండటం , ప్రముఖ ఎంఎన్‌సీలు కంపెనీలకు అతి సమీపంలో ఉండటం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత అని మధు సూదన్ తెలిపారు . ద ఒలింపస్ ప్రాజెక్ట్‌ను 2025 కల్లా పూర్తి చేస్తామని మధుసూదన్ తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *