దైవశక్తి తోనే దేశం సుసంపన్నం…జర్నలిస్టులతోనే నవ సమాజ ప్రగతి

ఘనంగా విజేఎఫ్ అవార్డుల ప్రధానోత్సవం

పాత్రికేయులు పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ

ఏయూ క్యాంపస్… అక్టోబర్ 30

నవ సమాజ ప్రగతిలో జర్నలిస్టులు పాత్ర అత్యంత ప్రశంసనీయమని, ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపుతున్న మార్గం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియం వేదికగా నిర్వహించిన ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమం అధ్యంతం కన్నులు పండువగా సాగింది. ఈ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి విచ్చేసి జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు తన దివ్య ఆశీస్సులు అందించారు. జర్నలిస్టులు బాగుంటేనే మెరుగైన సమాజానికి దోహదపడుతుందని స్వామీజీ తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు జర్నలిస్టులకు కూడ తమ శారదాపీఠం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. దేశం సుసంపన్నం గా ఉండాలంటే దైవ శక్తి తో పాటు ఆధ్యాత్మిక భక్తి భావాలు అందరు అలవర్చుకోవాలన్నారు.. ప్రతీ ఒక్కరూ దైవశక్తిని దక్కించుకుంటే నిరంతరం బిజీగా ఉన్న జర్నలిస్టులకు ఒత్తిడి సమస్య ఉండబోదన్నారు.

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అత్యంత ప్రశంసనీయమని కొనియాడారు. ప్రతి యేటా క్రమం తప్పకుండా మీడియా అవార్డులు ప్రధానం చేయడం, ఉపకార వేతనాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాల వల్ల విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది అన్నారు. అవార్డు గ్రహీతలు అందరికీ స్వామి శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది జర్నలిస్ట్ లు విశాఖ శారదా పీఠం ప్రగతిలో తమ వంతు సహకారం అందించారన్నారు. తాము ఎన్ని కార్యక్రమాలు నిర్వహించిన అవి బయట వారికీ తెలియాలంటే మీడియా సహకారమే ముఖ్యమన్నారు.. గౌరవ అతిథులుగా నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంఎల్ సి వరుదు కల్యాణి, రాష్ట్ర మారిటైం బోర్డ్ చైర్మన్ కాయల వెంకట రెడ్డి,ఏయూ వి సి ఆచార్య ప్రసాద్ రెడ్డి, ఈపీడిసిఎల్ సీఎండీ కె. సంతోష్ రావు, ఉపకార్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు కంచర్ల అచ్యుత రావు, సినీ హీరో ఉపేంద్ర , బ్రహ్మ కుమారీ రామేశ్వరి, పవర్ డిప్లొమా ఇంజనీర్స్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ పాత్రికేయులు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేయడం వల్లే మెరుగైన సమాజానికి దోహదం చేస్తుందన్నారు. ఎన్ని వత్తుడులు ఉన్నప్పటికీ పాత్రికేయులు ప్రజా సమస్యలపై పోరాటం పటిమ తో అలుపెరిగిన విధంగా ముందుకు సాగుతున్నారన్నారు .వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈ ఏడాది మీడియా అవార్డులు పండుగను మరింత ఘనంగా నిర్వహించామన్నారు. పిల్లలకు కూడా అందరికి ఉపకార వేతనాలు పంపిణీ చేశామన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ పాలకవర్గం పనిచేస్తుందన్నారు.గతంలో కంటే ఇప్పుడు విజేఎఫ్ కు ప్రపంచ దేశాల్లో అనేక ప్రెస్ క్లబ్ లతో మెరుగైన సంబంధాలు కలిగి ఉందన్నారు. జర్నలిస్టుల వైద్య ఖర్చులకోసం తన హయాంలో రూ.22 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. దీంతోపాటు విద్య, పండగులు క్రీడలు, మేళాలు, కొత్త సంవత్సరం వేడుకలు కోసం ఇలా అన్ని కార్య క్రమం లు నిర్వ హిస్తున్నా న్నామన్నారు. ఇటీవల దీపావళి పండుగను సుమారు తొమ్మిది లక్షలు వెచ్చించి 1100 మంది జర్నలిస్ట్ లుకి బాణాసంచా, స్వీట్స్ ప్రమిదలు పంపిణీ చేశామన్నారు. ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ సభ్యుల సంక్షేమమే లక్ష్యమన్నారు.

ఎడిటర్,సీనియర్ పాత్రికేయులు మంగు రాజగోపాల్ కు ఉత్తరాంధ్ర లెజెండ్ అవార్డును ప్రధానం చేయడం జరిగింది. వీరితోపాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ , ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్ట్ , వెబ్ జర్నలిస్టులతో కలిసి వివిధ రంగాల్లో సేవలు అందించిన 39 మందికి ఈ పురస్కారాలు అందజేశారు.
పురస్కార గ్రహీతలకు నగదు బహుమతులు, మెమెంటో, ప్రశంసా పత్రం, నూతన వస్త్రాలు, మిఠాయిలు ఇలా అన్నీ కూడా అతిధులు చేతుల మీదుగా అందజేశారు.

జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు

జర్నలిస్టుల పిల్లల్లో ఉన్న ప్రతిభాపాటవాలను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సుమారు 150 మంది జర్నలిస్టుల పిల్లలకు నగదు బహుమతులు, ప్రశంస పత్రాలు, మెమెంటో లు పలువురి చేతుల మీదుగా అందజేశారు.

సాంస్కృతిక విందు
ప్రముఖ కొరియోగ్రాఫర్ అర్. నాగరాజ్ పట్నాయక్ అధ్వర్యములో ఒడిస్సా, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.. ఈ ప్రదర్శనలు వీక్షకులకు కనువిందు చేశాయి. విజేఎఫ్ కార్యదర్శి దాడి రవి కుమార్, మీడియా అవార్డుల కమిటీ ఛైర్మెన్ ఆర్.నాగరాజ్ పట్నాయక్. ఇతర సభ్యులు మూర్తి, ఈశ్వర రావు, వరలక్ష్మి, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, గిరిబాబు, దివాకర్, గయాజ్, మాధవ్, శేఖర మంత్రి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *