ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కోహెడలో ఏర్పాటు -రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్
ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కోహెడలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడ మార్కెట్ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు. కొహెడ మార్కెట్ ను శంకుస్థాపన పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారంచుడతారని తెలిపారు. 178 ఎకరాలలో కోహెడ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని.. .. ఢిల్లీ మార్కెట్ కన్నా ఇది చాలా పెద్దదని తెలిపారు.మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారాయని.. భవిష్యత్ లో మరింత మారతాయన్నారు. గతంలో కూరగాయలు తక్కువ అన్నం, రొట్టెలు ఎక్కువ తింటే, ఇప్పుడు కూరలు, పండ్లు ఎక్కువ తింటున్నారని తెలిపారు.
అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగు పెరుగుతున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు . పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గడ్డిఅన్నారం మార్కెట్ సౌకర్యంగా లేవని..అందుకే కొహెడలో అతిపెద్ద మార్కెట్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు .
వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా రాష్ట్రంలో ఆహారశుద్ది పరిశ్రమల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఉద్యాన పంటల సాగుకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఔటర్ రింగ్ రోడ్ కు, రాబోయే రీజినల్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉండడం కోహెడ మార్కెట్ కు జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటుందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ మార్కెట్ రూపుదిద్దేందుకు లే అవుట్ సిద్దమవుతున్నదని..
అప్పటి వరకు క్రయ, విక్రయాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు బాటసింగారంలో తాత్కాలికంగా పండ్ల మార్కెట్ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కోహెడలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 50 వేల ఎకరాలలో ఆలుగడ్డ సాగు లక్ష్యంతో ఆలుగడ్డ విత్తనం స్టోరేజీ లక్ష్యంగా కోహెడ కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వ్యవసాయరంగం కేసీఆర్ నాయకత్వంలో దశ, దిశ మార్చుకున్నదని…. వారి ఆలోచనల మూలంగానే తెలంగాణ వ్యవసాయం సుస్థిరమవుతున్నదన్నారు.
కోహెడ పండ్ల మార్కెట్ కు 50 లక్షల రూపాయలతో వంద ఫీట్ల రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన శారు. అనంతరం కోహెడలో ఉద్యాన రైతులు, విక్రయదారులతో సమావేశమయ్యారు. బాటసింగారం తాత్కాలిక పండ్ల మార్కెట్ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మూసి రివర్ ఫ్రంట్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమీషనర్ రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయిలు పరిశీలించారు .
aposta-aviator
The latest arcade aviation tourney Aviator Adventurous – Aviator. You can not but enjoy nice graphics.
aposta-aviator.com