హైదరాబాద్ లో ఘనంగా జరిగిన శ్రీనిధి ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవం
హైదరాబాద్
వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సంస్థలు ,వ్యక్తులను గౌరవించడం అబినందనీయమని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని పార్క్ హోటల్ లో శ్రీనిధి ఎడ్యుకేషన్ గ్రూప్ ఐకాన్ అవార్డులతో 132 మందిని ఘనంగా సత్కరించారు. తమ సేవలను మరింత విస్తఈతం చేసేందుకు ఈ అవార్డులు ఎంతగానో దోహదపడతాయని జయేష్ రంజన్ అన్నారు .
ఐకాన్ వ్యవస్థాపకుడు క్రిష్ చింతలూరి మాట్లాడుతూ డెశవ్యప్తంగా ఐకాన్ అవార్డులు ప్రదానం చేయడం ఇది రెండవసారి అని, ఈ సెకండ్ సీజన్ టైటిల్ స్పోనర్ లుగా శ్రీనిధి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ముందుకురావడం సంతోషంగా ఉందన్నారు. శ్రీనిధి గ్రూఫ్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్ చేసిన సహయసహకారాలు మరువలేనివని, వారి తోడ్పాటు ఎప్పుడు ఉండాలని అన్నారు, ఐకాన్ సిఈఒ దినేశ్ష్ మురుగేషన్ మాట్లాడుతూ ఇతర స్పాన్సర్లు కార్పొరేట్ సర్వీసెస్ కాప్స్టన్ ఫెసిలిటీ ప్రెసిడెంట్ హరప్రసాద్ పాండా,ఆప్టిమస్ ఫార్మా మార్కెటింగ్ డైరెక్టర్ పి ప్రశంత్ రెడ్డి,లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ క్లబ్ మెంబర్ జె యెస్ మోహన్ రావు, శ్రీనిధి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీమతి మైత్రీ,అన్నమయ్య గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ సునీల్ తదితరులకు కఈతజ్ఒతలు తెలిపారు.
ఈ అవార్డులు తీసుకున్నవారిలో డిఎస్ ఎం వైస్ ప్రెసిడెంట్ మనోజ్ కార్ల, శ్రీనిధి ఎడ్యుకేషన్ గ్రూప్ సిఈఒ కె. అభిజిత్, సి ఎం ఆర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యుషన్స్ సెక్రటరీ గొపాల్ రెడ్డి, ఆప్టిమస్ ఫార్మా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్మార్ట్ ల్యాబ్టెక్ ఎండి సత్యప్రసాద్, నిమ్స్ ఆసుపత్రి వైద్యులు దా. నాగభుషణ్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అథిదులుగా హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు వేనుగోపాలచారి, ఐటి సెక్రటరి జయేశ్ రంజన్, సాంకేతిక విద్యాశఖ కమిషనర్ నవీన్ మిత్తల్, మాజి ఐఏస్ అధికారి లక్ష్మీ కాంతం లు పాల్గొని అవార్డులు ప్రదానం చేసారు.